చుండ్రు.ఎందరినో కామన్‌గా వేధించే సమస్య ఇది.తలలో జిడ్డు ఉత్పత్తి అధికంగా ఉండటం, వాతావరణంలో మార్పులు, తలస్నానం సమయంలో చేసే పొరపాట్లు, తడి జుట్టును దువ్వడం లేదా జడ వేసుకోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ కలర్స్‌ను యూస్ చేయడం వంటి రకరకాల కారణాల వల్ల చుండ్రు సమస్య ఏర్పడి తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.చుండ్రు సమస్యతో సతమతం అయ్యేవారు నలుగురిలో తిరగాలంటేనే భయపడుతుంటారు.
మిమ్మల్నీ చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతోందా.? అయితే ఇకపై టెన్షన్ పడక్కర్లేదు.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ స్ప్రేను వాడితే చుండ్రుకు పర్మినెంట్‌గా టాటా చెప్పొచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ స్ప్రేను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల బియ్యం, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఐదు గంటల పాటు నానబెట్టి.ఆపై వాటర్‌ను సపరేట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రైస్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ వాము, వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకుని నీరు సగం అయ్యే వరకు ఉడికించాలి.

ఇలా ఉడికించుకున్న మిశ్రమం నుంచి వాటర్‌ను వేరు చేసి చల్లారబెట్టుకోవాలి.కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వేప నూనెను కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకుని.రెండు గంటల అనంతరం తలస్నానం చేయాలి.ఇలా వారంలో ఒక్కసారి చేస్తే చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవచ్చు.







