బ‌రువు పెర‌గ‌డానికి తంటాలు ప‌డుతున్నారా? అయితే మీరివి తెలుసుకోండి!

బ‌రువు త‌గ్గాల‌నే కాదు.పెర‌గాల‌ని ప్ర‌య‌త్నించేవారు ఎంద‌రో ఉంటారు.

 These Are The Ways To Gain Weight Safely! Gain Weight, Weight Gain, Weight Gain-TeluguStop.com

హైపర్ థైరాయిడ్, ర‌క్త‌హీన‌త‌, టిబి, పోష‌కాహార లోపం, నిద్ర‌లేమి, సమయానికి ఆహారం తినకపోవడం, హై మెట‌బాలిజం, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బక్క పలచగా మారిపోతారు.ఇలాంటి వారు బ‌రువు పెర‌గ‌డం కోసం ప‌డే తంటాలు అన్నీ ఇన్నీ కావు.

పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ ఇలా ఏది ప‌డితే అది తింటూ, తాగుతూ ఉంటారు.ఒళ్ళు కదలకుండా కూర్చుంటారు.

కానీ, ఇక్క‌డ తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే.బ‌రువు పెర‌గ‌డం కాదు, సుర‌క్షితంగా పెర‌గ‌డం చాలా ముఖ్యం.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌రువు పెర‌గాలంటే ఆరోగ్యానికి హాని చేసే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఆయిలీ ఫుడ్స్‌, కూల్ డ్రింక్స్ వంటివే తీసుకోన‌క్క‌ర్లేదు.

పీన‌ట్ బ‌ట‌ర్‌, ఖ‌ర్జూరం, బ‌నానా మిల్క్ షేక్‌, గుడ్లు, మామిడి పండ్లు, ప‌న‌స పండు, అవ‌కాడో, పచ్చి కొబ్బ‌రి, పిస్తా ప‌ప్పు, జీడిప‌ప్పు, పాలు, పాల‌ ఉత్ప‌త్తులు, రైస్‌, బ్రౌన్ బ్రెడ్‌, వేరుశెన‌గ‌లు, రెడ్ మీట్‌, బంగాళ‌దుంప‌లు, చేప‌లు, బీన్స్, ప‌న్నీర్‌ వంటి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు తీసుకున్నా చ‌క్క‌గా బ‌రువు పెరుగుతారు.

అలాగే ఒళ్ళు కదలకుండా కూర్చుంటే.

బ‌రువు పెర‌గ‌డం కాదు, లేనిపోని జ‌బ్బులు త‌లెత్తుతాయి.అందుకే మ‌న ప‌నుల‌తో పాటు ఇంటి ప‌ని, వంట ప‌ని వంటివి చేయాలి.

బ‌రువు త‌గ్గ‌డానికే కాదు.పెర‌గ‌డానికి కూడా వ్యాయామాలు ఉంటాయి.

అటువంటి వ్యాయామాల‌ను అల‌వాటు చేసుకోవాలి.

ఫుడ్ తీసుకోవ‌డం ఎంత‌ ముఖ్య‌మో.

టైమ్ టు టైమ్ తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం.కాబ‌ట్టి, రోజూ ఆహారాన్ని వేళ‌కు తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి.

మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి చెడు అల‌వాట్ల‌ను వ‌దులుకోండి.కంటి నిండా నిద్ర‌పోండి.

ఒత్తిడి, డిప్రెష‌న్ వంటివి ద‌రి చేర‌కుండా ఉండేందుకు ధ్యానం చేయండి.త‌ద్వారా ఆరోగ్యంగా మ‌రియు సుర‌క్షితంగా బ‌రువు పెరుగుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube