హై హీల్స్ వేసుకోని ఎవరైనా మగవారు అలా నడిచొస్తే ఎలా ఉంటుంది? పిచ్చి పట్టింది అని అనుకుంటారు కదా.నేను సానిటరి ప్యాడ్స్ వేసుకున్నాను అని ఎవరైనా అబ్బాయి చెబితే, తేడా అనుకుంటాం కదా.
పింక్ కలర్ మీద ఇష్టమున్న బయటకి చెప్పలేరు మగవారు.కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ వస్తువులు మొదట మగవారు వాడినవే.
18వ శతాబ్దం లో పింక్ కలర్ ని మగవారి బలానికి చిహ్నంగా చెప్పుకునేవారట.ఎరుపు తరువాత యుద్ధాన్ని ప్రతిబింబించే రంగుగా కూడా ఉండేది ఒకప్పుడు పింక్ కలర్.
ఇప్పుడు మాత్రం పింక్ కలర్ ని మహిళల అందానికి, శక్తికి చిహ్నంగా చెప్పుకుంటున్నారు.ఇక ఇప్పుడు చెవిపోగు అందరు మగవారు వాడట్లేదు కాని ఒకప్పుడు మగవారు కూడా చెవిపోగులు వాడేవారు.
ఈ విషయం మనకు తెలియనిది కాదు.పురాణాల గురించి చదువుకున్న వారికి ఈజిగా తెలిసిన విషయమే.
ఇప్పుడు సెక్సిగా కనిపించడానికి అమ్మాయిలు వేసుకునే థాంగ్స్ (బికిని లాంటిది) కుడా ఒకప్పుడు మగవారు తమ పురుషాంగాన్ని కప్పుకోవడానికి వాడేవారట.ఇక ఫ్రాన్స్ లోని కొందరు నర్సులు యుద్ధాల్లో పాల్గొనే మగవారికి గాయాలైతే రక్తం ధారలుగా కారకుండా సానిటరి పాడ్స్ తయారు చేశారు.
వీటిని పోలిన పాడ్స్ ఇప్పుడు అమ్మాయిలు ఏ అవసరం కోసం వాడుతున్నారో మనందరికి తెలుసు.
నమ్మడానికి కష్టంగా ఉన్నా, హై హీల్స్ కూడా మొదట మగవారి కోసమే తయారు చేసారు.
గుర్రపు స్వారి చేసే పెర్షియన్ సైనికులు ఈ హై హీల్స్ ని వాడేవారట.కాలక్రమేణ ఇది అమ్మాయిలకు ఒక ఇష్టమైన వస్తువుగా మారింది.