సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మోహన్ బాబు( Mohan Babu ) ఒకరు.ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలోను నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అదేవిధంగా మోహన్ బాబు నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను నిర్మించారు.ఇప్పటికీ ఈయన పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇకపోతే ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మలయాళ నటుడు మోహన్ లాల్ ( Mohan La l) ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.నేను హీరోగా విలన్ గా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకొని బాగా సంపాదించాను అయితే ఆ సంపాదించినది మొత్తం తీసుకెళ్లి సినిమాలకే పెట్టాను దీంతో భారీగా నష్టపోయానని తెలిపారు.
ఇలా నష్టాలు ఎదుర్కొన్నటువంటి సమయంలో మోహన్ లాల్ నటించినటువంటి ఒక సినిమాని తెలుగులోకి రీమేక్ చేశాను.అలా అల్లుడుగారు సినిమాతో మరొక సక్సెస్ అందుకొని వెనతిరిగి చూసుకోలేదని తెలిపారు.

ఇక మోహన్ లాల్ తో నా అనుబంధం 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉందని తెలిపారు.నా సక్సెస్‌లో మోహన్ లాల్ కూడా ఓ భాగమయ్యారు.ఆయన నాకు సోదర సమానుడు.ఆయన మంచితనం గురించి మాటల్లో చెప్పలేను.ఇక కన్నప్ప( Kannappa ) సినిమాలో కూడా తను నటిస్తున్నారు కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాలేదు.మలయాళంలో నీతో కలసి నటించాలని నాకు కోరిక ఉంది.
ప్లీజ్ మోహన్ లాల్.నాకు ఒక ఛాన్స్ ఇవ్వు.
నీ సినిమాలో విలన్ రోల్ చేస్తా.కానీ అందులో నువ్వు నన్ను కొట్ట కూడదు.
కావాలంటే తిట్టు అరిచే సన్నివేశాలు ఉన్న నటిస్తారని కానీ నన్ను మాత్రం కొట్టొద్దు అంటూ ఆయనని రిక్వెస్ట్ చేస్తూ మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







