పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫేషియల్ హెయిర్ ను ఇలా తొలగించుకోండి!

ఫేషియల్ హెయిర్( Facial hair ).మగువల్లో ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

 Effective Home Remedy For Facial Hair Removal , Rice Flour,home Remedy, Facial H-TeluguStop.com

ఫేషియల్ హెయిర్ కారణంగా ముఖం రంగు తక్కువగా కనిపిస్తుంది.అలాగే ముఖంలో కాంతి దెబ్బతింటుంది.

ఈ క్రమంలోనే చాలా మంది మగువలు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు.కానీ, ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా సహజ పద్ధతిలో ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని( Chickpea flour ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ) వేసుకోవాలి.ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ), రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( raw milk ), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.చివరిగా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు కీరా జ్యూస్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్‌ సహాయంతో ముఖంపై పూతలా అప్లై చేసుకోవాలి.ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం చర్మాన్ని స్మూత్ గా మరియు స్లో గా రబ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ నేచురల్ రెమెడీ పాటిస్తే ఫేషియల్ హెయిర్ ను సులభంగా తొలగించుకోవచ్చు.

పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.చర్మం కాంతివంతంగా సైతం మారుతుంది.

కాబట్టి ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube