రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా ఆ చెక్కులను మండల కేంద్రంలోని లక్ష్మీ -మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో బుధవారం మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కె సాబేరా బేగం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.మండలంలో మొత్తం 141 మంది లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా అందులో ఎల్లారెడ్డిపేట 13,వెంకటాపూర్ 12, రాచర్ల తిమ్మాపూర్ 15, సింగారం 2,రాజన్నపేట 7, పోతిరెడ్డిపల్లి 2, పదిర 6, నారాయణపూర్ 13 కోరుట్లపేట 5,రాచర్ల గుండారం 6,రాచర్ల గొల్లపల్లి 20,దుమాల 5, రాచర్ల బొప్పాపూర్ 16, బండలింగంపల్లి 8, అల్మాస్ పూర్ 9, అక్కపల్లి 2 చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
జిల్లా లోనే ఎల్లారెడ్డిపేట మండలానికి 1 కోటి 41 లక్షల రూపాయల చెక్కులను అందజేసి మొదటి స్థానంలో నిలవడం జరిగిందని ఆమె అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారని, రైతులకు రుణమాఫీ తో పాటు సన్నవడ్లకు 500 బోనస్ ను కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
అంతే కాకుండా జనవరి 26 నుండి రైతు భరోసాను సంవత్సరానికి 12000 వేస్తూ భూమిలేని నిరుపేద కుటుంబాలకు కూడా సంవత్సరానికి 12 వేల రూపాయలు వేస్తామని,దీనిని ఇందిరమ్మ భరోసాగా పిలవడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ పేద ప్రజలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి,పి ఎస్ ఎస్ సి చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, తిమ్మాపూర్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,నాయకులు ఎస్కే సాహెబ్, షేక్ గౌస్, శ్రీనివాస్ రెడ్డి,గంట బుచ్చగౌడ్, చెన్ని బాబు,బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.