సెలవు రోజు ఓ భార్య తన భర్తతో మాట్లాడిన ఈ మాటలు చూస్తే

ఒక సెలవురోజు భార్య భర్తతో ” మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!” అంది

 A Wife Conversation With Her Husband What Is His Mistakes-TeluguStop.com

“ఫోన్ ఉంటే ఏమౌతుంది?”

ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి

“సరే చెప్పు !!ఏం మాట్లాడాలి ?”అన్నాడు భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ

“మీరు మారిపోయారు!”

“మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?”
“అప్పుడు గంటగంటకు మెసేజ్ లు లేదా ఫోన్లు!”

లేచిన తర్వాత మొదటిమాట నీతోనే.

పడుకునే ముందు చివరిమాట నీతోనే… మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.అలాగే ఉండేవారు’

“పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?”

“మీ కళ్ళలో.ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది

“ఇప్పుడెలా వున్నారు?”

“మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి?
ఒక గోడనో.వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు!!”
“మీరెందుకు మారి పోయారు?నాకు కారణం తెలియాలి!!
నా వల్లేమైనా తప్పుజరిగిందా?? చెప్పండి.అలా ఉంటే మార్చుకుంటాను” అంది భార్యా

చా అదేం లేదు
అదంతా సహజంగా జరిగేదే!” అన్నాడు భర్త

“అదే ఎలా జరుగుతుంది? నాకు జరగలేదే! పోనీ మీ గురించి చూసినా అప్పుడైనా ఫోన్ తో గడిపేవారు.ఇప్పుడు కూడా ఫోన్ తో గడుపుతున్నారు ఇంకా ఎక్కువగా!!”
“అంటే నేను ఫోన్ పాటి విలువచేయనా?” అడిగింది భార్య

అబ్బా ప్లీజ్ అపార్థం చేసుకోకు అదంతా సహజంగా జరుగుతుందని నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రెంట్ కు ఉన్న మా ఇంటి ఓనర్ అంకుల్ కూడా చెబుతుండేవాడు.అతనో ఎక్జాంపుల్ కూడా చెబుతుండేవాడు అది వింటే నువ్వు కూడా కరెక్టే అంటావు” అన్నాడు భర్త

సరే ఆ ఎక్జాంపుల్ ఏమిటో చెప్పండి అడిగింది

అతను చిరునవ్వుతో
“ఎక్జాంపుల్ కు
మీకు బంగారునగలమీద ఆకర్షణ ఉంటుంది.చేయించుకునేటంత వరకు కూడా చేయించుకున్న తర్వాత
కొత్తలో ఫ్రెండ్స్ కూ.బంధువులకూ.అపురూపంగా చూయించుకుంటూ మురిసిపోతుంటారు
తర్వాత బీరువాలోని లాకర్ లో పెట్టేసుకుంటారు
రోజూ వెళ్లి చూస్తుంటారా?
అలా అని వాటిమీద నిర్లక్ష్యమనా అర్థం కాదుగా??
వస్తువు దూరమున్నపుడు ఆకర్షణ
మనదే ఐనతర్వాత ఆకర్షణ స్థానంలో.ఒక లోటు నిండిన తృప్తి.

నమ్మకం అంతే అన్నాడు

అతని ఈ వాదన విన్నాక ఆమె ఒక్కసారిగా స్టన్నై పోయింది తర్వాత కాసేపటి వరకు నవ్వుతూనే ఉంది

అలా ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అతను ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు

కాసేపటి తర్వాత ఆమె ఇలా చెప్పసాగింది

“చాలా థాంక్సండీ నన్ను-ఒక రాయితోనో రప్పతోనో కాకుండా బంగారంతోనైనా పోల్చినందుకు

మీ అంకుల్ కు ఒక నమస్కారం
కానీ.మనుషులంటే ప్రాణంలేని వస్తువులు కారు

మనకు బాగా ఇష్టమైన ఒక మొక్కను తెచ్చి పెంచుకుంటాము
అసలు ఆ మాటలోనే ఉంది చూడండి మొక్కను పెంచుకుంటాము.

బంగారాన్ని ఉంచుకుంటాము

సరే ఆ మొక్కను తెచ్చి నాలుగు రోజులు మురిసిపోయి తర్వాత బీరువా లాకర్ లో పెట్టి చూడండి
క్రమంగా వాడిపోయి నిర్జీవమౌతుంది

దాన్ని రోజూ కేర్ గా చూసుకోవాలి.నీళ్లుపోయాలి.

బలం కోసం ఎరువు వేయాలి అవసరమైతే కంచె కూడా వేయాలి
అప్పుడే అది పుష్పిస్తుంది.ఫలిస్తుంది.

సుగంధ పరిమళాలతో నిన్ను ముంచెత్తుతుంది

మనుషుల ప్రేమలైనా అనుబంధాలైనా అంతే

నిజం చెప్పాలంటే.మన పెండ్లి వరకు నాకు నీమీదుంది కేవలం ఆకర్షణ మాత్రమే ఎప్పుడైతే మన పెండ్లి తర్వాత నా సర్వస్వాన్ని నీకర్పించానో అప్పుడే ప్రేమించడం ప్రారంభించాను

ఇప్పుడు కూడా నువ్వెలా వున్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను కూడా కానీ సజీవమైన నీచూపులకు అలవాటు పడ్డ నేను నీ నిర్జీవమైన చూపులకు తట్టుకోలేకపోతున్నాను

ఒక్క విషయం నిజం చెప్పు కుటుంబ పరంగా చూసినపుడు నువ్వు ఇప్పుడు హ్యాపీ గా ఉన్నావా? అప్పుడా

భార్య విశ్లేషణతో ఆలోచనలో పడ్డ అతను అప్పుడే అన్నాడు నిజాయితీగా

మీలో నాకు బాగా నచ్చే విషయాల్లో ఇది కూడా ఒకటి మీరు ఏ విషయంలోనైనా కన్వీనెన్స్ అయితే చాలు అది ఖచ్చితంగా పాటిస్తారు నిజాయితీగా ఒప్పుకుంటారు కూడా అంది భార్య

నిజంగా చాలా చాలా థాంక్స్

ఏ మనిషైనా కష్టమైన పనుల కంటే .ఈజీగా చేసే పనులకు సపోర్ట్ గా వుండే వాదనకే తొందరగా కన్వీనెన్స్ అవుతాడు

అంకుల్ వాదనతో కన్వీనెన్స్ అయిన నాకు ఆ మాటలు సబ్ కాన్సియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోయాయి

“నీ మాటల్లో ఉన్న నిజం నా హృదయానికి కూడా తెలుస్తోంది…
ఈ రోజు మన మధ్య జరిగిన సంభాషణ ఒక్క నీ విషయంలోనే కాదు.నా జీవితానికి కూడా ముఖ్యమైనది…మనుషుల పట్ల నా ఆటిట్యూడ్ ను మార్చివేసేది…

ప్రాణంలేని వస్తువులకు.ప్రాణమున్న మనుషులకు మధ్య తేడా కూడా అర్థమైంది

ఆ బంగారాన్ని బీరువాలాకర్ లో బంధించాలి
ఈ బంగారాన్ని హృదయంలో బంధించాలి అంతే కదా
ఉండు నిన్నిక క్షణ క్షణం నా చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తాను చూడు అన్నాడతను ఆమె కళ్ళలోకి.ఇష్టంగా.

ప్రేమగా.మైకంగా చూస్తూ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube