రాజన్న సిరిసిల్ల జిల్లా: చిన్నారుల మనసుల్లో చిరకాలం గుర్తిండిపోయేలా అంకితభావంతో పనిచేయడమే ఉపాధ్యాయులకు అసలైన గుర్తింపు అని ఎల్లారెడ్డి పేట మండల విద్యాధికారి కృష్ణహరి అన్నారు.రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి బదిలీపై ఇతర పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణహరి మాట్లాడుతూ, పిల్లల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసేలా విద్యార్థులకు చిరకాలం గుర్తిండిపోయే విధంగా బోదిస్తేనే ఉపాధ్యాయులకు అసలైన గుర్తింపు అన్నారు.జీవితంలో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, వారు ఒకప్పుడు ఉపాధ్యాయునికి శిష్యుడే అన్నారు.
అనంతరం బదిలీపై వెళ్లిన పప్పుల శ్రీనివాస్, వెంకట లక్ష్మీ, అంజయ్య, ప్రేమ్ సాగర్, కవిత లను శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణాధి శ్రీనివాస్, ఉపాధ్యాయులు సంధ్య రాణి, విజయలక్ష్మి, దేవదాసు, అశ్విని, పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.







