మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో చెప్పలేం.ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కరోల్ అకోస్టా (Carol Acosta)అనుకోని విధంగా చనిపోయింది.
ఈ విషాద వార్త సోషల్ మీడియాను ఒక్కసారిగా కుదిపేసింది.ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న 27 ఏళ్ల కరోల్, న్యూయార్క్‌లో(Carol , New York) తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తుండగా ఊపిరాడక మృతి చెందారు.
కరోల్ మరణవార్తను ఆమె సోదరి కట్యాన్(Katyan) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది.“నేను నిన్ను ప్రేమిస్తున్నాను సోదరీ.ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ కన్నీటి సందేశం పోస్ట్ చేసింది.అంతేకాదు, దేవుడు తనకు ఇంత మంచి మనసున్న సోదరిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.“శాంతిగా విశ్రాంతి తీసుకో నా సోదరీ” అని భావోద్వేగంతో రాసుకొచ్చింది.
కరోల్ ఆన్‌లైన్‌లో ‘కిల్లడమెంటే’(‘Killadamente’) అనే పేరుతో కూడా సుపరిచితురాలు.
ఆమె మరణించిన రోజు జనవరి 3 అని తెలుస్తోంది.కరోల్ డిన్నర్ చేస్తుండగా ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది పడిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిందని ఆమె బంధువులు గోఫండ్‌మీ పేజీ ద్వారా తెలిపారు.“చిన్న వయసులోనే ఆమె తన పని ద్వారా వేలాది మందికి సహాయం చేసింది.ఇప్పుడు ఆమెకు తగిన వీడ్కోలు పలికేందుకు అందరం కలిసి రావాలి” అని వారు పేర్కొన్నారు.
అయితే, కరోల్ మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.పలు పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, అప్పుడే అసలు విషయం తెలుస్తుందని కట్యాన్ తెలిపింది.కరోల్ తన సోదరి మాత్రమే కాదని, తన పార్ట్‌నర్, బెస్ట్ ఫ్రెండ్ కూడా అని మరో పోస్ట్‌లో కట్యాన్ గుర్తు చేసుకుంది.“నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావని నాకు తెలుసు” అని ఆమె రాసుకొచ్చింది.
బాడీ పాజిటివిటీని ప్రోత్సహించడంలో కరోల్ అకోస్టా చాలా కృషి చేసి మంచి పేరు తెచ్చుకుంది.ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె ఫాలోవర్లు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.“ఇంత త్వరగా వెళ్లిపోయావా.చాలా బాధగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు “నిన్ను చాలా మిస్ అవుతాం.
స్వర్గంలో సంతోషంగా ఉండు” అని రాసుకొచ్చారు.ఈ సడన్ డెత్ ఆమె ఫాలోయర్స్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.