5000 మందికి సహాయం చేసిన ప్రముఖ నిర్మాత.. ఈయన మనస్సుకు గ్రేట్ అనాల్సిందే!

టాలీవుడ్ నిర్మాత ఆదిత్య రామ్(adithya ram) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన ఏక్ నిరంజన్ (Ek Niranjan)సినిమాను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Producer Adityaram Help 5000 Poor People, Adithya Ram, Helping, Sankranthi Festi-TeluguStop.com

ఆ తర్వాత కాలంలో సినిమాలకు కాస్త దూరమైన ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పలు రకాల బిజినెస్ లు కూడా చేశారు.అలా తమిళనాడులో బాగా సెటిల్ అయిపోయారు.

తమిళనాడులో ఆదిత్య రామ్ ప్యాలెస్ అంటే బాగా ఫేమస్.ప్యాలెస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది సహాయం.

ఎంతోమందికి సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.అయితే అందులో భాగంగానే నిర్మాత ఆదిత్య రామ్ (Producer Aditya Ram)తాజాగా తన గొప్ప మనసును తాడుకున్నారు.

పది ఇరవై కాదు ఏకంగా 5000 మందికి సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నారు ఆదిత్య రామ్.ఇంటి అవసరాలకు కావలసిన నిత్య అవసరాలను తాజాగా అందించారు.ఆదిత్య రామ్‌ అనగానే అమలాపురం అల్లునిగా ఒక తెలుగువాడుగా చెన్నైలో ఫుల్‌ ఫేమస్‌.ఈ ఏడాది సంక్రాంతి పండగకి(festival of Sankranti) ఆయన 5000 మందికి పైగా వారి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యావసరాలను అందించారు.

ఆయన ద్వారా సాయం పొందినవారు ఎందుకు బాబు ఇవన్నీ మా కోసం చేస్తున్నావని అడగ్గా ఆదిత్యారామ్‌ మాట్లాడుతూ.నేను చాలా చిన్న స్థాయి నుండి ఈ స్థాయి వరకు వచ్చాను.

అవసరాలు ఎలా ఉంటాయో అవి అవసరమైన వారికే తెలుస్తాయి.నాకు మీ అవసరాలు తెలుసు.

అందుకే నాకు చేతనైన సాయం వీలైనంతమందికి చేస్తుంటాను.ఈ పండక్కి దాదాపు 5000 మందికి పైగానే నిత్యావసరాలను అందించే చేసే అవకాశం దక్కింది.ఇలానే మీ ఆశీస్సులు ఉంటే వీలైనంత ఎక్కువ మందికి అవసరమైన వారందరికి సాయం చేయాలని నా మనస్సు ఎప్పుడూ కోరుకుంటుంది అని అన్నారు.ఆయన చేస్తున్న గొప్ప పనికి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

నిత్యవసర సరుకులు 5000 మందికి అంటే మామూలు విషయం కాదని నిజంగా ఆదిత్య రామ్ ది చాలా గొప్ప మనసు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube