బయటకు వెళ్ళటానికి 5 నిమిషాల ముందు ఇలా చేస్తే తెల్లగా మెరిసిపోతారు

ఏదైనా పార్టీకి వెళ్లే ముందు ఇలా చేస్తే అందరిలో ప్రత్యేకంగా,అందంగా కనపడతారు.సాధారణంగా బయటకు వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకోవటం సాధారణమే.

 How To Get Glowing Skin In 5 Minutes In Telugu-TeluguStop.com

ఆ మేకప్ ఎక్కువ సేపు ఉండదు.మేకప్ సరిగా లేకపోతే ముఖం కాంతి విహీనంగా కనపడవచ్చు.

అందువల్ల ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మీరు పార్టీలో అందంగా మెరిసిపోతారు.ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

మొదట ముఖాన్ని శుభ్రంగా కడిగి పొడి టవల్ తో తడి లేకుండా తుడుచుకోవాలి.ఒక బౌల్ లో పచ్చిపాలను తీసుకోని దానిలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాయాలి.

ఈ విధంగా ముఖానికి పాలను రాయటం వలన చర్మ రంద్రాలు తెరుచుకొని మలినాలు తొలగిపోతాయి.పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం,పోషకాలు చర్మం మీద నలుపుని,తాన్ ని తొలగించటంలో సహాయపడి ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా చేస్తాయి.

ముఖానికి పాలను రాసాక 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ పద్దతిని ఫాలో అవ్వాలి.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బొంబాయి రవ్వను వేసి సరిపడా పాలను పోసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.ఈ పేస్ట్ ముఖానికి రాసి సున్నితంగా స్క్రాబింగ్ చేయాలి.

ఈ విధంగా చేయుట వలన బ్లాక్ హెడ్స్ మరియు మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.ఈ విధంగా ముఖాన్ని బాగా స్క్రబ్ చేసాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.


ఆ తర్వాత ఈ పద్దతిని ఫాలో అవ్వాలి.ఈ విధానంలో ముఖానికి పేస్ ప్యాక్ వేసుకోవాలి.ఈ ప్యాక్ కోసం బియ్యంపిండి,మైదా పిండి,టమోటా రసం,పచ్చి పాలు అవసరం అవుతాయి.ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యంపిండి, ఒక స్పూన్ మైదా పిండి,ఒక స్పూన్ టమోటా రసం,సరిపడా పాలను పోసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్ ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.ఈ ప్యాక్ వేయటం వలన చర్మంపై నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది.

ఇక చివరి పద్ధతి ఏమిటంటే… ముఖం ఎక్కువసేపు తాజాగా ఉండటానికి ఐస్ ముక్కతో ముఖాన్ని రబ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన చర్మంలో రక్త ప్రసరణ పెరిగి ముఖం కాంతివంతంగా కనపడుతుంది.

బయటకు వెళ్లే ముందు ఈ విధంగా చేస్తే ముఖం తెల్లగా కాంతివంతంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube