పుట్టిన రోజును బట్టి గ్రహాల ప్రభావం ఉండి గ్రహ స్థితి మారుతుంది.ఒక్కో రోజు పుట్టినవారు ఒక్కో రకంగా జీవితంలో ముందగుడు వేస్తూ ఉంటారు.
అయితే మీరు ఏ రోజు పుట్టారో తెలిస్తే మీ జీవితంలో కష్ట సుఖాలు,లాభ నష్టాల గురించి తెలుసుకోవచ్చు.ఇప్పుడు ఏ వారంలో పుడితే ఏ ఫలితాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.
సోమవారంసోమవారం పుట్టినవారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.వీరు అనుకున్న పనిని సాధిస్తారు.వీరి స్వభావం కొంచెం సున్నితంగా,మృదువుగా ఉంటుంది.విద్యార్థులు అయితే చదువులో కొంచెం అశ్రద్దగా ఉంటారు.
వారు ఆనందంగా ఉండటమే కాకుండా పక్కన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు.
మంగళ వారంమంగళవారంలో పుట్టినవారు కొంచెం ఆవేశంగా ఉంటారు.
వారు ఆవేశంలో ఎదో చేసేసి సమస్యల్లో పడతారు.చిన్న చిన్న విషయాలను చాలా పెద్దవిగా చేసి ఇబ్బందుల్లో పడతారు.
కొంచెం కోపం తగ్గించుకొని అందరితో కలిసి జీవితం అంతా ఆనందంగా ఉండవచ్చు.వీరు చాలా నిజాయితీగా ఉంటారు.
అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు.
బుధవారంబుధవారం జన్మించిన వారిలో కొన్ని విశిషమైన లక్షణాలు ఉంటాయి.అలాగే వీరిలో భక్తి ఎక్కువగా ఉండి ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు.ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడని నమ్ముతారు.
ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు బాగా ఆలోచిస్తారు.వీరు అందరితో చాలా మర్యాదగా ఉంటారు.
గురువారంగురువారం జన్మించిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.వీరు చాలా దైర్యంగా ఉంటారు.అలాగే తీసుకొనే నిర్ణయం చాలా వేగంగా ఉంటుంది.వీరికి కష్టాన్ని ఎదుర్కొనే దైర్యం ఎక్కువ ఉంటుంది.
అంతేకాక హాని చేయరు.వీరి మంచి మనస్సుకి అదృష్టం కలిసి వస్తుంది.
శుక్రవారంశుక్రవారం పుట్టినవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.మీ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.వీరికి బృహస్పతి ప్రభావం ఉండుట వలన చేసే పనులు విజయవంతం అవుతాయి.ఏదైనా కష్టం వచ్చిన వెంటనే బయట పడిపోయే నేర్పు ఉంటుంది.
శనివారంశనివారం పుట్టినవారికి వ్యవసాయం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.అంతేకాక వ్యాపారం మరియు టెక్నాలజీ రంగాల్లోనే కూడా బాగా రాణిస్తారు.స్నేహితులు వీరిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు.జీవితంలో అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఆదివారంఆదివారం పుట్టినవారు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతారు.సామజిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.అలాగే అదృష్టం వీరిని వెన్నంటే ఉంటుంది.కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
వారి కోసం ఏమి చేయటానికి అయినా రెడీగా ఉంటారు.