వేడి ఆవిర్లు.చాలా వరకు మెనోపాజ్ సమయంలోనే ఈ సమస్య ఎదురవుతుంది.
ఆడవారిలో రుతుక్రమం ఆగిపోవటానికి వేడి ఆవిర్లు ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు.ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గడం మహిళల్లో వేడి ఆవిర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఒత్తిడి, టైట్ దుస్తులు ధరించడం, మద్యం అలవాటు, కెఫిన్ ఎక్కువడం తీసుకోవడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వేడి ఆవిర్లు వస్తాయి.చాలా హాఠాత్తుగా వచ్చే వేడి ఆవిర్ల వల్ల.
ముఖం ఎర్రగా మారిపోతుంది.ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.
శరీరం మొత్తంగా వేడిగా మారిపోతోంది.ఇక ఈ సమయంలో చాలా చిరాకు మరియు విసుగు వచ్చేస్తుంది.అయితే చాలా మంది ఈ వేడి ఆవిర్లను ఎలా తగ్గించుకోవాలో తెలియదు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.
సులువుగా వేడి ఆవిర్లను తగ్గించుకోవచ్చు.నల్ల జీలకర్ర వేడి ఆవిర్లను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
కాబట్టి, నల్ల జీలకర్రను వాటర్‌లో నానబెట్టి తీసుకోవడం లేదా ఆహారంతో కలిపి తీసుకోవడం మంచిది.

అలాగే పచ్చళ్లు, వేపుళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.మజ్జిగ, నీరు, పండ్లు, పండ్లరసాలు తీసుకోవాలి.తద్వారా వేడి ఆవిర్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఇక విటమిన్ ఇ ఈ వేడి ఆవిర్లను తగ్గించడంతో అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండు పొద్దుతిరుగుడు నూనె, బాదం, వేరుశెనగ, గుమ్మడికాయ వంటి ఆహారం తీసుకుంటే.
వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి.
విటమిన్ సి కూడా వేడి ఆవిర్లను తగ్గిస్తుంది.
అందువల్ల.నారింజ, కమలా, బొప్పాయి, జామ వంటి పండ్లతో పాటు తాజా కూరగాయాలు, ఆకు కూరలు కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇక వేడి అవిర్ల సమయంలో కోల్డ్ వాటర్ తాగితే.శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
అలాగే వేడి ఆవిర్లను తగ్గించుకోవాలనుకునేవారు మద్యం అలవాటు, స్మోకింగ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.