జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి 2018 టైం అస్సలు బాగోలేదు.ఎక్కడికి వెళ్లి ఏమి మాట్లాడినా సరే పవన్ మాట్లాడిన మాటలు మిగిలిన పార్టీలకి ఆయుధాలు అవుతున్నాయి.
అంటే విషయపరిజ్ఞానం లేకుండా మాటలు చెప్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో జనసేన నాయకుడికి బాగా తెలిసివచ్చింది అనే చెప్పాలి…నాయకుడు అంటే అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి.ఒక వేళ ఉండకపోయినా సరే పార్టీలో చర్చించుకుని మాట్లాడాలి.
కానీ పవన్ కి ఇలాంటివి అసలు గిట్టవు.నోటికి వచ్చినట్టు ఎదో మాట్లాడేయడం తప్ప తనకి తెలిసిన పరిజ్ఞానం సూన్యం అని ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది.
అసలు ఇంట ఉపోద్ఘాతము ఎందుకు చెప్తున్నాం అంటే…అసలు విషయం ఇదీ.
జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్,కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెప్పి 24 విద్యుత్ పై కేసీఆర్ నిర్ణయం సంచలనం నేను షాక్ అయ్యాను అంటూ.కేసీఆర్ గారు ఎంతో మంచి పని చస్తున్నారు అంటూ నాలుగు సినిమా డైలాగులు చెప్పి వెళ్ళిపోయాడు.కానీ అసలు విషయం తెలుసుకోకుండా మీడియా మైకులు మౌత్ ముందు ఉంటే ఎదో జాతీయ స్థాయి నాయకుడిలా కలరింగ్ ఇస్తూ చటుక్కున ఎదో చెప్పేశాడు.
ఇక్కడే ప్రతిపక్షాల నుంచీ వామపక్షాల వరకు పవన్ కి తలంటేశాయి.నీకు తెలిసిందే గోరంత అంటూ ఏకి పడేశాయి అన్ని పార్టీలు.
పవన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు నేను ఎక్కువగా వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిని అని అటువంటి వామపక్ష పార్టీ అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలు ఏమిటో పవన్ కళ్యాణ్ కి తెలియదు అని ఆయన పార్టీ.ఆయన గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు.
అంటూ విమర్శించారు.పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాని అని తనకి విషయం మీద పరిజ్ఞానం లేనపుడు మాట్లాడక పోవడం మంచిది అని తెలిసీ తెలియని రాజకీయ చేసి ప్రజలని ఎమార్చవద్దు అని ఫైర్ అయ్యారు.చత్తీసగఢ్ నుంచి ఒక్కో యూనిట్ రూ.5 చొప్పున కొనుగోలు చేసి తీసుకొస్తున్నాము అని అంటూ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ నెలకు రూ.రెండు వేల కోట్ల అదనపు భారం పెడుతున్నారని.ఈ విషయం నీకు తెలుసా అంటూ ప్రశ్నించారు…ముందు విషయం తెలుసుకుని మాట్లాడటం నేర్చుమని హితవు పలికారు.