ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.20
సూర్యాస్తమయం: సాయంత్రం 06.00
రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో నిర్ణయించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.
సింహం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని పనులు వాయిదా పడతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల చదువుల గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
తులా:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.
కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
పిల్లల చదువుల పట్ల కాస్త ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.
కుంభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీనివల్ల కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మీనం

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఎక్కువవుతోంది.