ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం( Artificial Intelligence )లో దూసుకుపోవాలని టెక్ దిగ్గజాలు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.గత సంవత్సరం మైక్రోసాఫ్ట్ స్టార్టప్ ఓపెన్ AI చాట్ జిపిటి( AI Chat GPT ) ని లాంచ్ చేసినాక సర్వత్రా ఎలాంటి దుమారం చెలరేగిందో అందరికీ తెలిసినదే.
తరువాత దీనికి పోటీగా మేమున్నాం అంటూ మరో టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది మార్చిలో AI బార్డ్‌ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే.ఈనెల 10వ తేదీ వరకు యూకే, అమెరికాల్లోనే అందుబాటులో వున్న బర్ద్ ప్రస్తుతం భారత్ సహా 180 దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రావడం గమనార్హం.

ఈ రేసులో ఒకానొక దశలో చాట్ జిపిటి కంటే కాస్త వెనకబడ్డ బార్డ్ వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అదనపు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తోంది.చాట్‌జీపీటీ మాదిరిగా గూగుల్ బార్డ్( Google Bard ) కూడా లాగ్వేజ్ మోడల్.దీన్ని చాట్‌బోట్ అని కూడా అంటారు.బార్డ్.ఇపుడు చాట్‌జీపీటీకి మల్లె పెద్ద మొత్తంలో టెక్ట్స్ డేటా( Text Data )పై శిక్షణ పొందింది.అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వగలదు.
ప్రశ్నలకు సమాధానాలివ్వడం, వివిధ భాషల్లోకి అనువదించడం, టెక్ట్స్ కంటెంట్‌ను జెనరేటివ్ క్రియేటివ్ కంటెంట్‌గా మార్చడం, కోడింగ్ రాయడం, డీబగ్గింగ్ చేయడం, కోడింగ్‌పై వివరణ ఇవ్వడం సహా మరెన్నింటినో బార్డ్ కూడా అవలీలగా చేయగలదు.

అయితే చాట్‌జీపీటీ కంటే బార్డ్ మరిన్ని పనులు చేయగలదు అని గూగుల్( Google ) చెబుతోంది.గూగుల్ బార్డ్‌లో వాయిస్ ఇన్‌పుట్‌తోనూ ప్రశ్నలు అడగవచ్చు.ఉదాహరణకు మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏదైనా సమాధానం కావాలంటే సులభంగా వాయిస్ రూపంలో ఇన్‌పుట్ ఇస్తే సరిపోతుందన్నమాట.
అంతే కాకుండా గూగుల్ బార్డ్ టెక్ట్స్‌ను పిడిఎఫ్, వర్డ్, HTML వంటి రూపాల్లో కూడా ఇవ్వగలదు.ఫలితంగా పనిని ఇతరులతో పంచుకోవడం సహా ఇతర అప్లికేషన్లు వినియోగించిన సమయాల్లో ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.







