అవును, బ్యాంకు ఖాతాదారులకు సదరు బ్యాంకులు ఓ శుభవార్తను మోసుకొచ్చాయి.విషయం ఏమంటే ఖాతాదారులు గతంలో ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మర్చిపోయినా, ఆ అకౌంట్‌లో మీ డబ్బులు అలాగే వున్నా లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి మర్చిపోయినా ఇక ఏం పర్వాలేదు.
ఎందుకంటే అలా బ్యాంకులో మీరు ఏరకంగా మర్చిపోయిన డబ్బులైనా ఆయా బ్యాంకులు తిరిగి మీకు వెనక్కి ఇచ్చేయనున్నాయి.

అవును, బ్యాంకు ఖాతాల్లో( Bank Accounts ) అలా మర్చిపోయిన డబ్బుల్ని, ఎవరూ క్లెయిమ్ చేయని నగదును అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌గా బ్యాంకులు గుర్తిస్తాయనే విషయం విదితమే.ఈ డబ్బులపై సదరు ఖాతాదారులకే పూర్తి హక్కు ఉంటుంది.అయితే కొన్ని కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్‌లో లేదా డిపాజిట్ అకౌంట్‌లో( Deposit Accounts ) డబ్బులు మర్చిపోతుంటారు.
ఇలా తమకు చెందిన డబ్బుల్ని క్లెయిమ్ చేయనివారికి బ్యాంకులు ఇపుడు పిలిచి మరీ డబ్బులు వెనక్కి ఇవ్వబోతున్నాయి.ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇపుడు 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.

ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతీ జిల్లాలో బ్యాంకులు తమ టాప్ 100 డిపాజిట్లను ట్రేస్ చేసి మరీ సెటిల్ చేసేందుకు ప్రత్యేకంగా 100 రోజుల ప్రచారాన్ని నిర్వహించబోతోంది ఆర్‌బీఐ.ఈ ప్రచార కార్యక్రమం జూన్ 1న ప్రారంభం కాగా 10 సంవత్సరాల నిర్వహింపబడనుంది.సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను “అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు”( Unclaimed Deposits )గా బ్యాంకులు గుర్తించి, ఎవరూ క్లెయిమ్ చేయని నగదును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న “డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్” ఫండ్‌కి బదిలీ చేయనున్నాయి.







