కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!

ముఖ అందాన్ని పాడు చేసే వాటిలో నల్లటి వడియాలు ముందు వరుసలో ఉంటాయి.

ఒత్తిడి, కంటినిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందులు వాడకం, జీవనశైలిలో మార్పులు తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ‌తాయి.

ఇవి ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.చర్మం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా కూడా నల్లటి వలయాలు ముఖాన్ని కాంతిహీనంగా చూపుతాయి.

ఈ క్రమంలోనే నల్లటి వలయాలను వదిలించుకునేందుకు రకరకాల క్రీములు, సీరంలు వాడుతుంటారు.అయితే పైసా ఖర్చు లేకుండా న్యాచురల్ గా కూడా నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.

అందుకు క్యారెట్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ తో నల్లటి వలయాలకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక చిన్న క్యారెట్( Carrot ) ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు క్యారెట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ వేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి వాసెలిన్ పూర్తిగా మెల్ట్ అయ్యేవరకు హీట్ చేయాలి.

ఆ తర్వాత హీట్ చేసిన మిశ్రమాన్ని చల్లార పెట్టుకుని.ఆపై అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel)వేసుకుని బాగా మిక్స్ చేస్తే ఒక క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాల‌ పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా నిత్యం చేశారంటే నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?

డార్క్ సర్కిల్స్ ( Dark Circles )ను వదిలించడానికి ఈ క్యారెట్ క్రీమ్‌ ఎంత ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు