కరివేపాకు ( Curry Leaves ) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.రోజూవారీ వంటల్లో కరివేపాకును విరివిరిగా వాడతారు.
ఆహారం రుచిని పెంచడంలో కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది.అలాగే కరివేపాకులో అనేక రకాలు విటమిన్స్, మినరల్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.కొవ్వును( Fat ) కరిగించే సామర్థ్యం కూడా కరివేపాకుకు ఉంది.
ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు నిత్యం ఉదయం కరివేపాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అయ్యాక మూడు రెబ్బలు కరివేపాకును అందులో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Fennel Seeds ) వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Black Pepper ) వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి సేవించాలి.

ఈ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ఈ హెర్బల్ డ్రింక్( Herbal Drink ) శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.కేలరీలు త్వరగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి ఈ హెర్బల్ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

పైగా ఈ హెర్బల్ డ్రింక్ ను నిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.అంతేకాకుండా ఈ హెర్బల్ డ్రింక్ బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరియు కంటి చూపును సైతం షార్ప్ గా మారుస్తుంది.