వేలు విరిగినా తెగించి ఆడి సెంచరీ చేసి, ఏడు వికెట్లు తీసిన క్రికెటర్

క్రికెట్ లో ఒక్కోసారి ఒక్క పరుగు కూడా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది.అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతారు.

 Unforgettable Innings By International Cricketer Larry Gomes, Cricketer Larry Go-TeluguStop.com

తమ జట్టును గెలిపించేందుకు ఎన్ని ఇబ్బందులైనా పడతారు.ఎలాంటి పరిస్థితిలలో ఉన్నా.

జట్టు విజయం సాధించడమే టార్గెట్ గా బరిలలో కొట్లాడుతారు.వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అని భావిస్తారు.

జట్టును ముందుకు నడిపిస్తారు.ఒక మ్యాచ్ లో సచిన్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కూడా 99 పరుగులు చేసాడు.

తన తండ్రి చనిపోయాడని క్రీజులో ఉండగా తెలిసినా.ఆ బాధ దిగమింగుకుంటూ మరోసారి జట్టును గెలిపించాడు లిటిల్ మాస్టర్.

సేమ్ ఇలాంటి పరిస్థితిలో ఉంటూ అతిగొప్ప ఇన్నింగ్స్ ఆడాడు వెస్టిండీస్ క్రికెటర్ లారి గోమ్స్.1984లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది.అక్కడ రెండో టెస్టు జరుగుతున్నది.ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 270 రన్స్ చేసింది. ఇంగ్లండ్ గెలుపు సునాయాసం అనుకుంటున్న సమయంలో లారి గోమ్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి వెస్టిండీస్ ని ఆదుకున్నాడు.సెంచరీ చేసి మ్యాచ్ ని విజయ తీరాలకు తీసుకెళ్లాడు.

తోటి క్రికెటర్లు అంతా ఒకటి రెండు పరుగులకే అవుట్ అవుతున్నా సరే.తను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.వరుసగా వికెట్లు పడుతున్నా చివరి వికెట్ సహకారంతో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.

Telugu Cricketerlarry, Larry Gomes-Telugu Stop Exclusive Top Stories

అంతకు ముందు ఫీల్డింగ్ చేస్తుండగా లారి బొటనవేలు విరిగింది.ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు.ఒంటి చేత్తో బాట్ ఝులిపిస్తూ పరుగులు రాబట్టాడు.

క్రికెట్‌లో ఇదో అద్భుత ఇన్నింగ్స్ గా క్రికెట్ అభిమానులు చెప్తుంటారు.అతడు ఉన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయకపోయినా ఎవరూ అడిగే వాళ్ళు ఉండేవారు కాదు.అయినా అతడు జట్టు కోసం ఆడాడు.2వ ఇన్నింగ్స్‌ లో విరిగిన బొటన వేలుతోనే బౌలింగ్ చేశాడు. 7 వికెట్లు తీసి కేవలం 53 పరుగులు ఇచ్చాడు.మొత్తంగా తమ జట్టును ఈ ఒకే ఒక్కడు గెలిపించాడు.ఈ మ్యాచ్ తర్వాత అతనికి స్వదేశంలో అద్భుత స్వాగతం లభించింది.దేశం తనపై చూపిన ప్రేమకు ముగ్దుడు అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube