ఒక్క రోజులో సన్నగా అవ్వాలని సర్జరీ చేయుంచుకొని కన్ను మూసిన స్టార్స్ వీళ్ళే..!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.రంగుల ప్రపంచంలో నిలదొక్కుకుని ఒక స్థాయి అనేది సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది.

 Star Actors Who Lost Lives Because Of Lipo Surgery, Arthhi Agarwal, Dasari, Lipo-TeluguStop.com

అయితే ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో కూడా విజయాన్ని సాధిస్తారు.ఏమాత్రం తేడా వచ్చినా కానీ సినిమా రంగం నుంచి బయటకు రాకపోతే మాత్రం ఇక వాళ్ల జీవితం అంతే సంగతులు.

అలా ఒక వెలుగు వెలిగి కొంతమంది నటులు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు.వాళ్లు ఎవరో ఏంటో తెలుసుకుందాం.

బాలీవుడ్ నటి మిస్తీ ముఖర్జీ జీవితం కూడా అంతే.బెంగాలీ సినిమాల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.అలాగే పలు హిందీ సినిమాల్లో నటించారు.అయితే హిందీలో మంచి ఐటమ్స్ సాంగ్స్ లో.తక్కువగా నటిగా నటించారు మిస్తీ ముఖర్జీ.అయితే ఈవిడకి జెనెటిక్ గా ఒక సమస్య ఉంది.

అది ఏంటంటే ఏ మాత్రం కొంచెం తిన్నా కానీ వెంటనే లావెక్కి పోతుంది.సినిమా అవకాశాలు కొద్దిగా తగ్గడంతో బరువు కూడా పెరిగిపోయింది.

మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో మళ్లీ సన్నగా అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది.కానీ వేగంగా తగ్గాలనే పిచ్చితో కీటో డైట్ ను ఫాలో అయింది.

అందం పాడవుతుంది అని తెలిసిన గాని, సన్నగా అవ్వడం ముఖ్యం అని అనుకున్నది.బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా సన్నగా అవ్వాలని డాక్టర్స్ వద్దని చెప్పిన గాని అతిగా డైట్ ఫాలో అయింది.

బరువు తగ్గడం మాట పక్కన పెడితే ఆరోగ్యం చెడిపోయింది. మిస్తీ కిడ్నీలు పాడయిపోయాయి.

లక్షలు ఖర్చుపెట్టిన ఉపయోగం ఏమి లేదు.చివరికి ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోయింది.

కనీసం సర్జరీ చేసి కాపాడడానికి శరీరంలో రక్తం చుక్క లేదు.అంత సన్నగా మారిపోయింది.

తన కూతురు పరిస్థితి చూసి మిస్తీ వాళ్ళ నాన్న కన్నీరు మున్నీరు అయ్యారు.కేవలం పెద్ద సినిమాలో నటించాలనే తపనతో కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది మిస్తీ.

Telugu Arthi Agarwal, Dasari, Misthi-Telugu Stop Exclusive Top Stories

అలాగే టాలీవూడ్ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా అంతే.ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఈవిడ కూడా ఒకటి.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆర్తీ జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది.సినిమా రంగంలో ఏ స్టార్ అయినా గాని ఒక్కసారి మాత్రమే స్టార్ డమ్ ను అనుభవిస్తారు.

ఆ స్టార్ డమ్ పోయిన తర్వాత సినిమాలని వదిలి పెట్టేసి తమ వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడపాలి.కానీ మళ్ళీ మంచి సినిమాల్లో నటించాలని ఆర్తీ తాపత్రయం చెందింది.

సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో బాగా లావు అయిపొయింది ఆర్తీ.తరువాత ఒబేసిటీ కారణంగా కొన్ని సినిమాలు తన దాక వచ్చి ఆగిపోయాయి.

అందుకనే బరువు తగ్గడానికి లైపో సెక్షన్ చేయించుకుంది ఆర్తీ.అయితే హైదరాబాద్ లో ఆమె వ్యక్తిగతంగా తెలిసిన ఒక డాక్టరు ఆర్తీ కి సలహా కూడా ఇచ్చారట.

లైపో సెక్షన్ చేయించుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు.బరువు అనేది సహజంగా తగ్గాలని.

డైట్ ఫాలో అవ్వడం, వ్యాయామం చేయడం మంచిది అని సలహా కూడా ఇచ్చారట.కానీ ఆర్తి అగర్వాల్ ఆయన మాటలు వినలేదు.

అయితే ఆర్తి అగర్వాల్ పుట్టింది పెరిగింది అంతా అమెరికాలో అవడంతో అమెరికాలోని ఒక హాస్పిటల్లో లైపోసెక్షన్ చేయించుకుంది.లైపో తరువాత ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి.

ఆ తరువాత లంగ్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఒక అర్ధరాత్రి ఆర్తీ అగర్వాల్ తుది శ్వాస విడిచారు.చిన్న వయసులోనే చిరంజీవి లాంటి హీరోలతో నటించిన ఆమె ఇంకా సినిమా కెరీర్ నే పెంచుకోవాలని అత్యాశతో భర్తకు కూడా విడాకులు ఇచ్చింది.

కానీ ఆర్తీ జీవితం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది.

Telugu Arthi Agarwal, Dasari, Misthi-Telugu Stop Exclusive Top Stories

అలాగే మరొక ప్రముఖ నటుడు రాకేష్ దివానా.ఆయన నటించని సీరియల్స్ ఉండేవికావు.కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.

మంచి పేరు సంపాదించుకున్నాడు.అయితే ఆయన 48 సంవత్సరాల వయసుకే బాగా బరువై అయిపోయారు.

బరువు తగ్గడానికి జీర్ణాశయానికి సంబంధించిన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.అయితే ఈ సర్జరీ చాలా ప్రమాదకరం అనే చెప్పాలి.కానీ ఆ ఆపరేషన్ చేయించుకున్నాడు.ఆపరేషన్ సక్సెస్ అయినా కానీ ఆయన బీపీ లెవల్స్ ను కంట్రోల్ చేయడం డాక్టర్ వల్ల కూడా కాలేదు.ఎన్ని మందులు వాడిన కానీ బీపీ ని కంట్రోల్ చేయలేక తుదిశ్వాస విడిచారు.టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సైతం లైపో చేయించుకున్నాకనే కన్ను మూసారు.

సర్జరీ చేయించుకొని బ్రతికిన వారు

అలాగే మన దేశ బీజేపీ మంత్రి అయిన అరుణ్ జెట్లీ కూడా అధిక బరువుతో బాధపడేవారు.ఇలా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని సన్నగా అయ్యారు.

కానీ, ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. 50 ఏళ్ల తర్వాత ఎలాంటి సర్జరీలు కూడా చేయించుకోకూడదని డాక్టర్లు కూడా మనకు ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు.

లైపోసక్షన్ అనేది కూడా చాలా ప్రమాదకరం త్వరగా సన్నగా అవ్వాలనే అత్యాశకు పోయి లైపోసక్షన్ లాంటి సర్జరీలు చేయించుకుంటే ఇబ్బందులు తప్పవు.సాధారణంగానే మన శరీర బరువుని తగ్గించుకోవడానికి ప్రయత్నిచాలి కానీ ఎలాంటి ప్రమాదకర సర్జరీలను చేయించుకోకూడదు.

Telugu Arthi Agarwal, Dasari, Misthi-Telugu Stop Exclusive Top Stories

అలాగే పాకిస్తాన్ కి చెందిన అజ్నాన్ సామీ కూడా ఈ కోవలోకి చెందినవారే.అయితే ఈయన ఏడాదిలోనే 130 కేజీల బరువు తగ్గి రికార్డు నెలకొల్పాడు.పాకిస్తాన్ కి చెందిన ఈ సింగర్ ఇండియాలో సెటిల్ కావడం మాత్రమే కాదు, పౌరసత్వం తీసుకుని పద్మశ్రీ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.ఆయన బరువుగా ఉన్నప్పుడు నడవలేక వీల్చైర్ పై తిరగాల్సి వచ్చింది.

అలాగే విమానంలో టికెట్ కావాలంటే నానా అగచాట్లు పడేవారు అంట.దీనితో దుబాయ్ లో లైపోసక్షన్ చేయించుకుని మరి బరువు తగ్గాడు.అయితే ఆయనకు ఆపరేషన్ అనేది విడతల వారీగా చేశారట.ఎందుకంటే అంత కొవ్వు ఒకేసారి తీయడం ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన గాని ఇంకా బరువు తగ్గకపోతే అంతే సంగతులు అని అభిప్రాయ పడి 75 కేజీల లోపు మాత్రమే బరువు ఉండేలా మైంటైన్ చేస్తున్నాడు.

అతి కష్టం మీద లైపో సక్షన్ చేయించుకుని బయట పడ్డాడు.అలాగే ఎన్నో కోట్లు ఉన్నాగాని ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఏకంగా 18 నెలల్లో డైటింగ్, వ్యాయామం చేసి ఏకంగా 108 కేజీల బరువు తగ్గాడు.

నిజంగా ఇది ఒక వండర్ అనే చెప్పాలి.కానీ డైట్ మెయింటైన్ చేయక పోవడం వలన మళ్ళీ బరువు పెరిగిపోయాడు.

అలాగే బాగా ఫ్యాట్ గా ఉండి మళ్ళీ తన శరీర ఆకృతిని మార్చుకున్న హీరోయిన్లలో సోనాక్షి సిన్హా కూడా ఉంది అని చెప్పవచ్చు.సోనాక్షి లావుగా ఉండడం చేసి ఆమెను హీరోయిన్ పక్కన ఉండే ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో కూడా పనికిరాదు అని హేళన చేసారు.

కానీ ఏ మాటలను సోనాక్షి సీరియస్ గా తీసుకుని ఒక ఏడాదిలో ఎంతో కష్టపడి బరువు తగ్గి నాజూగ్గా తయారయింది.ఓ ఏడాదిలో 40 కేజీల బరువు తగ్గి 55 కేజీల వరకు వచ్చింది.

Telugu Arthi Agarwal, Dasari, Misthi-Telugu Stop Exclusive Top Stories

అలాగే ఈ లిస్ట్ లోని ఇంకొక సెలిబ్రిటీ అర్జున్ కపూర్.22 ఏళ్ల వయసులోనే 120-140 దాక బరువు పెరిగిపోయారు.ఆ తరువాత తన తల్లి అనారోగ్యం పాలవడంతో కెరీర్ మీద దృష్టి పెట్టి డైట్ మెయింటైన్ చేసాడు.జిమ్ లో ఎంతో కష్టపడి వర్క్ ఔట్స్ కూడా చేసేవాడు.

ఏడాదిలోనే 70 కేజీల బరువు తగ్గాడు.

అలాగే ఇప్పుడు టాప్ పోసిషన్ లో ఉన్న అలియాభట్ ను ఒకప్పుడు దర్శకులు తిరస్కరించారట.

అప్పట్లో ఈమె తండ్రి కూడా అలియాభట్ తో సినిమాకి నో చెప్పాడట.అసలు హీరోయిన్ అంతే ఎలా ఉండాలో పూజా భట్ ను చూసి నేర్చుకోమని చెప్పాడట.

అలా అలియాభట్ కి కరణ్ జోహార్ ఒక ఆఫర్ ఇచ్చాడట.మూడు నెలల్లో బరువు తగ్గితే సినిమాలో నటిస్తావ్ లేదంటే లేదు అని చెప్పడంతో ఎంతో కష్టపడి బరువు తగ్గింది అలియాభట్.

Telugu Arthi Agarwal, Dasari, Misthi-Telugu Stop Exclusive Top Stories

ఇలా మన సెలబ్రిటీస్ లో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిచారు.బరువు పెరిగాక తగ్గడానికి కష్టపడే బదులు అసలు బరువు పెరగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube