మన భారతీయుల తెలివితేటలకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ఏదైనా కష్టాన్ని సులువుగా మార్చే ‘జుగాడ్’( Jugaad ) టెక్నిక్‌తో మనోళ్లు ఎప్పుడూ ముందుంటారు.
పాత బట్టలతో బ్యాగులు తయారు చేయడం దగ్గర నుంచి ఇంట్లో వస్తువులతోనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను రిపేర్ చేయడం వరకు, భారతీయుల క్రియేటివిటీకి( Indians Creativity ) హద్దుల్లేవని చెప్పవచ్చు.అయితే తాజాగా కెనడాలో( Canada ) జరిగిన ఒక సంఘటన మరోసారి ఈ విషయాన్ని నిరూపించింది.
ఒక గుజరాతీ( Gujarati ) వ్యక్తి తన బాల్కనీని ఫ్రిజ్‌గా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ వీడియోలో కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ, “కెనడా చాలా ఖరీదైన దేశం, కానీ మనం గుజరాతీలం.
ప్రపంచం తలకిందులైనా మా బడ్జెట్ మాత్రం మారదు” అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.అసలు విషయమేమిటంటే, ఆ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి టీ తాగడానికి వెళ్లాడు.
టీ కోసం పాలు కావాలని అడిగితే, స్నేహితుడు ఫ్రిజ్ తెరిచాడు.ఫ్రిజ్( Fridge ) ఖాళీగా ఉండటంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
అప్పుడు స్నేహితుడు బాల్కనీలో చూడమని చెప్పాడు.
బాల్కనీలోకి( Balcony ) వెళ్లి చూస్తే షాక్, బాల్కనీ మొత్తం తాత్కాలిక ఫ్రిజ్‌లా మారిపోయింది.బయట ఉష్ణోగ్రత -15°C డిగ్రీల సెల్సియస్ ఉండడంతో, పాల ప్యాకెట్లు, మిగిలిపోయిన ఆహారం, ఇతర నిల్వ చేయాల్సిన వస్తువులన్నీ బాల్కనీ నేలపై చక్కగా అమర్చబడి ఉన్నాయి.చల్లటి వాతావరణం వల్ల అన్నీ తాజాగా ఉన్నాయి.
ఇది చూసి కంటెంట్ క్రియేటర్ నవ్వుతూ, “ప్రతి గుజరాతీ ఒక్కో ఎలాన్ మస్క్ లాంటోడే” అని సరదాగా అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.చాలా మంది ఈ ఆలోచన అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే, ఫిన్లాండ్ వంటి చల్లని దేశాల్లో తాము కూడా ఇలాగే చేస్తామని మరికొందరు కామెంట్ చేశారు.
డబ్బులు ఆదా చేయడానికి భారతీయులు ఏమైనా చేస్తారని మరోసారి రుజువైంది.