టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన వారిలో అల్లు అర్జున్ ( Allu Arjun ) ఒకరు.అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక పుష్ప( Pushpa ) సినిమాతో ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇటీవల వచ్చిన పుష్ప 2 సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కి అభిమానులుగా మారిపోయారు.ఇక హీరోయిన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.ఎంతోమంది హీరోయిన్స్ అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్రలో అయినా నటించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.అయితే తాజాగా నటి ప్రియా భవాని( Priya Bhavani ) సైతం అల్లు అర్జున్ పై తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ తన మనసులో కోరికను బయట పెట్టారు.

కళ్యాణం కమనీయం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ప్రియా భవాని.ఈ సినిమా తర్వాత గోపీచంద్ భీమా, సత్యదేవ్ జీబ్రా ఇండియన్ 2 వంటి సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఈమె పలు సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియ భవాని అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ కు తాను పిచ్చి అభిమానినని తెలిపారు.
ఒక్కసారైనా అల్లు అర్జున్ తో కలిసి బిగ్ స్క్రీన్ పై కనిపించాలన్నదే తన కోరిక అని తెలిపారు.అది రొమాంటిక్ సన్నివేశాలు అయిన తాను నటిస్తాను అంటూ ఈమె తన మనసులో కోరికను బయటపెట్టారు.
మరి బన్నీ ఈమె కోరికను నెరవేరుస్తూ తన సినిమాలో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సిందే.