సాధారణంగా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే టూత్ బ్రష్( Tooth Brush ) చేసుకుంటూ ఉంటాము.ఎందుకంటే పళ్ళు( Teeth ) మన చిరునవ్వుకు ఎంతో అందాన్ని ఇస్తాయి.
అందుకే దంతాలు తెల్లగా, ఆకర్షణీయంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.కొంతమంది ఆయుర్వేదిక్ టూత్ పేస్టుని వాడితే, మరికొంతమంది రకరకాల హోమ్ రెమిడీస్‌ని ప్రయత్నిస్తూ ఉంటారు.
కానీ అందరూ చేసే తప్పు ఏమిటంటే ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు ఉపయోగించడం.కొంతమంది టూత్ పేస్టులను మారుస్తారు.
కానీ బ్రష్ ని మార్చారు.ఒకే టూత్ బ్రష్ ను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల నోటి సమస్యలు మొదలవుతాయి.

టూత్ బ్రష్ తరచుగా మార్చడం ఎంతో ముఖ్యం.మీ బ్రష్ ను నిర్దిష్ట సమయం కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే అది దంతాలు మరియు చిగుళ్ళకు ఎంతో హాని చేస్తుంది.బ్రష్ మార్చకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.సెంటర్స్ ఫర్ సెంటర్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ టూత్ బ్రష్ ను ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు మారుస్తూ ఉండాలి.
కానీ మీ బ్రష్ అంతకుముందు పాడైతే మీరు దానిని మూడు నెలలకు ముందు మార్చడమే మంచిది.పాడవకుండా ఉండేందుకు వీలైతే ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన బ్రష్ నీ కొనుగోలు చేయడం మంచిది.

దీని కారణంగా మూడు నుంచి నాలుగు నెలలు వరకు బ్రష్ ను ఉపయోగించడానికి మీకు సమయం ఉంటుంది.టూత్ బ్రష్ ముళ్ళగరికెలు దంతాలను శుభ్రపరచడంలో, సూక్ష్మ జీవులను తొలగించడంలో ఎంతో సహాయపడతాయి.బ్రష్ ను ఎక్కువ రోజులు ఉపయోగిస్తే ముళ్ళలో పెళుసుదనం వస్తుంది.అలాగే మీరు పెద్ద అనారోగ్యం నుంచి కొలుకున్న సమయంలో ఉపయోగించిన బ్రష్ ను మార్చడమే మంచిది.
ఎందుకంటే వ్యాధికి ఉపయోగించే టూత్ బ్రష్‌పై చాలా సూక్ష్మ జీవులు ఉంటాయి.కాబట్టి అనారోగ్యం నుంచి కొనుక్కున్న తర్వాత కొత్త టూత్ బ్రష్ ను ఉపయోగించాలి.