చలికాలంలో ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఊడమన్న ఊడ‌దు!

చలికాలంలో( winter ) వచ్చే కొన్ని మార్పుల కారణంగా చాలా మంది అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఎంతో ఇష్టంగా పెంచుకున్న‌ జుట్టు రోజూ ఊడిపోతుంటే చూసి సహించలేకపోతుంటారు.

 This Effective Remedy Helps To Stop Hair Fall During Winter! Hair Fall, Stop Hai-TeluguStop.com

జుట్టు రాలడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఆరాటపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు ఊడమన్న ఊడదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి( Besan flour ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్( Almond powder ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకుని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒక ఎగ్ వైట్ ను కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Healthy, Remedy, Fall, Effectiveremedy-Telugu Health

ముప్పై నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ( Hair mask )ను కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని చాలా వేగంగా మరియు సమర్థవంతంగా అరికడుతుంది.

హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.అలాగే ఈ మాస్క్ ద్వారా మీ జుట్టుకు విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు విటమిన్ బి అందుతాయి.

ఇవి జుట్టు వేగంగా మరియు బలంగా పెరగడానికి సహాయపడతాయి.

Telugu Care, Care Tips, Healthy, Remedy, Fall, Effectiveremedy-Telugu Health

గుడ్డు, బాదం లో ఉండే ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్ హెయిర్ అండ్ స్కాల్ప్ ను తేమగా ఉంచుతాయి.పొడి బారకుండా రక్షిస్తాయి.అంతేకాకుండా వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల హెయిర్ షైనీ గా మారుతుంది.

జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube