వింటర్ సీజన్ లో కొబ్బరి నీళ్లు తాగొచ్చా.. తప్పక తెలుసుకోండి..!

కొబ్బరి నీళ్లు( coconut water ).పిల్లల‌ నుంచి పెద్దల వరకు చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ ఇది.

 Can You Drink Coconut Water In Winter? Coconut Water, Coconut Water Health Benef-TeluguStop.com

ఎటువంటి కలుషితం లేకుండా ఎంతో స్వచ్ఛంగా కొబ్బరినీళ్లు ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి.

అయితే వింట‌ర్ సీజన్ లో కొబ్బరి నీళ్లు తాగితే జలుబు చేస్తుందని కొందరు నమ్ముతుంటారు.ఈ క్రమంలోనే చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా.? అని చాలా మంది డౌట్ ప‌డుతుంటారు.కానీ ఎటువంటి సందేహం లేకుండా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు.కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ( Vitamins, minerals, electrolytes )పుష్కలంగా ఉంటాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మ‌న రోగనిరోధక శక్తిని( Immunity ) పెంపొందిస్తాయి.అలాగే కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్‌కి మంచి మూలం.

శీతాకాల వాతావరణంలో బాడీని హైడ్రేటెడ్‌గా ఉండటానికి కొబ్బ‌రి నీళ్లు ఉత్త‌మంగా సహాయపడ‌తాయి.

Telugu Coconut Coconut, Tips, Latest-Telugu Health

కొబ్బరి నీటిలో ఫైబర్( Fiber ) మరియు సహజ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి.ఇవి జీర్ణక్రియకు మ‌ద్దతు ఇస్తాయి.కొబ్బరి నీళ్లలో ఉండే పలు పోష‌కాలు మీ చర్మాన్ని హైడ్రేట్ గా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

అలాగే కొబ్బరి నీళ్లలో కొవ్వు ఉండదు.తగినన్ని కొబ్బరి నీళ్లు తాగితే ఆకలి తీరుతుంది.

ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి.దాంతో బరువు కూడా తగ్గుతారు.

Telugu Coconut Coconut, Tips, Latest-Telugu Health

అయితే కొబ్బరి నీళ్లలో పొటాషియం( Potassium ) ఎక్కువగా ఉంటుంది, ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న వారిలో హైపర్‌కలేమియాకు దారితీస్తుంది.అందువ‌ల్ల మూత్రపిండ వ్యాధి ఉన్న కొబ్బ‌రి నీళ్ల‌కు దూరంగా ఉండాలి.కొబ్బరి నీళ్లలో సహజ చక్కెరలు ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి.మధుమేహం ఉన్నవారు చాలా పరిమితంగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.కొబ్బరి నీరు రక్తపోటును తగ్గిస్తుంది, కాబట్టి అధిక రక్తపోటు కోసం మందులు తీసుకునే వ్యక్తులు కొబ్బరి నీరు తాగే ముందు వైద్యులను సంప్రదించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube