కోతులు మాములు అల్లరి చేయవు.ఒక్కోసారి వాటి అల్లరి లిమిట్స్ దాటుతుంటుంది.
అలాంటి సందర్భాలలో దానికి గానీ లేదంటే ఇతరులకు గానీ నష్టం వాటిల్లుతుంది.తాజాగా వారణాసిలో ( Varanasi )అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
పార్క్ చేసి ఉన్న ఓ కారు సన్‌రూఫ్ విండోని ఒక తుంటరి కోతి పగలగొట్టింది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ అనుకోని సంఘటన చూసిన వారంతా షాక్ అయ్యారు.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న ఈ వీడియోలో, కోతి సడన్‌గా దగ్గర్లో ఉన్న ఒక ఇంటి పైకప్పు నుంచి కారు మీదకు దూకింది.
అది నేరుగా కారు సన్‌రూఫ్ కిటికీ ( Sunroof window )మీద పడటంతో కిటికీ పగిలిపోయింది.పగిలిపోయిన కిటికీ గుండా కారులోకి జారిపడిన కోతి, వెనుక సీటు మీద పడి, మళ్లీ అదే మార్గంలో బయటకు దూకింది.
ఆ తర్వాత, అది ఎలాంటి గాయాలూ లేకుండా రోడ్డు మీద నడిచి వెళ్లిపోయింది.
వారణాసిలోని విశ్వేశ్వర్‌గంజ్ ప్రాంతంలో ( Visveshwarganj area )గత మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ విచిత్ర సంఘటన స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఈ ఘటనను చాలా ఫన్నీగా ఉందని అన్నారు.అయితే, మరికొందరు మాత్రం కోతి భద్రత గురించి ఆందోళన చెందారు.
కొంతమంది కారు యజమాని ఆర్థిక నష్టాన్ని గురించి సానుభూతి చూపించారు.
ఒక యూజర్ “ఆ కోతికి ఏమైందో?” అని అడిగితే, మరొకరు కోతి వీడియో చూస్తున్నట్లు ఉండే జిఫ్ పంచుకుంటూ, “ఇప్పుడు ఆ కోతి తన వీడియోనే చూస్తోంది” అని వ్యాఖ్యానించింది.మరొకరు, “ఇలాంటి నష్టానికి ఇన్సూరెన్స్ వస్తుందా?” అని అడిగారు.“ఇది చాలా తుంటరి కోతి అనుకుంటా, సినిమా హీరో స్టైల్‌లో కారు మీదకు జంప్ చేయాల్సిన అవసరం లేదు, ఇది చేసిన పని వల్ల యజమానికి చాలా నష్టం” అని ఒకరు అన్నారు.