NTR Rama Krishna Studio : ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో పెర్మిషన్ కోసం ఆ రోజుల్లో ఇంత ఇబ్బంది పడ్డారా ?

Ntr Stodges For Ramakrishna Studio ,NTR, Rama Krishna Studio , Tollywood ,Krishna ,Saradhi Studio ,Annapurna Studio ,Akkineni Anr , Nandamuri Taraka Rama Rao

టాలీవుడ్ లో చాల మందికి తమ తమ పరిధిలో సొంత స్టూడియోలు ఉన్నాయ్. కృష్ణ కు సారధి స్టూడియో, అక్కినేని కి అన్నపూర్ణ స్టూడియో ఉన్నట్టుగానే నందమూరి తారక రామ రావు గారికి కూడా రామకృష్ణ స్టూడియో వుంది.

 Ntr Stodges For Ramakrishna Studio ,ntr, Rama Krishna Studio , Tollywood ,krishn-TeluguStop.com

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అయినా రామకృష్ణ పేరు పైన ఇది కట్టించడం జరిగింది.నాటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీ అంత మద్రాసులో ఉండేది.

కానీ తెలుగు వారు తమ సినిమాలను సొంత రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు అనే ఉద్దేషం తోనే అంత అనుకోని హైదరాబాద్ తరలి వచ్చారు.అయితే ఇదే సమయంలో సినిమాలు నిర్మించాలంటే స్థలం ఉండాలి కాబట్టి షూటింగ్ ల కోసం స్టూడియో నిర్మాణం చేపట్టారు.

అయితే అన్నగారు ఈ స్టూడియో నిర్మాణం ప్లానింగ్ చేయకముందే అక్కినేని తొలుత ఏడెకరాల భూమిని ప్రభుత్వం నుంచి తీసుకొని తన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం చేసారు.అప్పటికి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనా జరుగుతుంది.అన్నగారికి కాంగ్రెస్ పార్టీ నచ్చేది కాదు.అక్కినేని కి పుష్కలంగా కాంగ్రెస్ అండదండలు ఉండటం తో ఆయనే తొలుత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు.

దీంట్లో అక్కినేని తప్పు కూడా ఏమి లేదనే చెప్పాలి.ఆయనకు ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఆయన్ను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పరిచయం పెంచుకొని ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు.

Telugu Akkineni Anr, Krishna, Nandamuritaraka, Ramakrishna, Saradhi Studio, Toll

ఎన్టీఆర్ కి కాంగ్రెస్ పార్టీ మాట అంటే ఎలాగూ పట్టదు కాబట్టి అక్కినేని ని అయినా తమ గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకున్నారు.ఇక పూర్తిగా హైదరాబాద్ కి చిత్ర పరిశ్రమ వచ్చేసింది.అన్నగారు కూడా వచ్చేసారు.హైదరాబాద్ నుంచి మద్రాసు కి వెళ్లి షూటింగ్ చేయడం అంటే చాల పెద్ద తలనొప్పి.అందుకే పక్క స్టూడియో లో తాను ఎందుకు షూట్ చేయాలనీ భావించి తానే సొంతంగా స్టూడియో కట్టాలని అని అనుకున్నారు.కానీ అంత తొందరగా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు.దాంతో అనుకున్న సమయానికి స్టూడియో నిర్మాణం జరగలేదు.దాదాపు నాలుగు సంవత్సరాల టైం పట్టిన తరువాత పర్మిషన్ వచ్చి నిర్మాణం చెప్పట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube