సిరులిచ్చే కల్పవల్లి.. శ్రీ పైడి తల్లి స్థల పురాణం తెలుసా?

ఉత్తరాంధ్రుల కల్పవల్లి… గజపతుల ఆడపడుచు.వాత్సల్య తరంగిణి.

 Do You Know The Sthala Puranam Of Sri Paidi Thalli Temple , Devotional, Guntur P-TeluguStop.com

సకల కల్యాణ గుణరూపిణి శ్రీ పైడితల్లి అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే బొబ్బిలి యుద్ధం వెళ్తానన్న అన్నను వారించి, దాన్ని నిలువరించడానికి చివరి వరకు ప్రయత్నించింది.

కానీ అన్న మరణంతో తనువు చాలించి… సమాజ హితమే తన అభిమతం అన్ని – ప్రబోధించిన పుణ్యమూర్తి పైడిమాంబ.మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి చరితం.ఆదర్శనీయం.ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పైడితల్లి అమ్మవారి ఆలయం ఒకటి.ఈ ఆలయం విజయనగరం పట్టణంలో ఉంది.కొలిచిన వారి కొంగుబంగారమై అన్నువారు ఇక్కడ పూజలందుకుంటున్నది.

అమ్మవారి ప్రాశస్త్యం ఇదీ.18వ శతాబ్దంలో విజయనగరాన్ని గజపతి వంశానికి చెందిన పూసపాటి పెద్ద విజయ రామరాజు పాలించేవారు.ఆయన సోదరే పైడిమాంబ.విజయరామ రాజుకు బొచ్చిలి సంస్థానాధీశుడు రాజా గోపాల కృష్ణరంగారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉండేది.ఈ శత్రుత్వం చినికి చినికి గాలివానలా మారి బొబ్బిలి యుద్ధానికి దారి తీసింది.ఫ్రెంచ్ సేనాధిపతి బుస్సీ అండతో విజయ గజపతి.బొబ్బిలిపై దాడికి దిగాడు.1757 జనవరి 23న యుద్ధం ప్రారంభమైంది.యుద్ధం విషయం తెలుసుకున్న పైడిమాంబ రణం వద్దని అన్నను వారించింది.యుద్ధమంటే వినాశనమని.

అబలల నుదుట ఆరుణాస్తమయమని.తెలిపింది.

జన, ధన, ప్రాణ హననాన్ని కళ్లకు కట్టేలా తన వాదనను వినిపించింది.

అయినా, సోదరి మాటను విజయగజపతి పెడచెవిన పెట్టాడు.

ఈ యుద్ధంలో ఫ్రెంచ్.రంగుల దాటికి బొబ్బిలి కోట పూర్తిగా ధ్వంసమైంది.

ఫ్రెంచ్ తుపాకుల ముందు బొబ్బిలి వాడి కత్తులు చిన్నబోయాయి.యుద్ధ సమయంలోనే పైడిమాంబకు మసూచి వ్యాధి సోకుతుంది.

పూజలో ఉన్నప్పుడు తన అన్నకు ఆపద ఉందని దుర్గమ్మ దయతో తెలుసుకొని.తన అనారోగ్య వార్తను తెలిపి యుద్ధాన్ని ఆపాలంటూ అన్నకు విన్నవించాల్సిందిగా పతివాడ అప్పలనాయుడు అనే సైనికుడితో వర్తమానం పంపుతుంది.

వెనుకనే వదినతో కలిసి బయలు దేరుతుంది.విజయ గర్వంతో వున్న విజయరామరాజును తాండ్ర పాపారాయుడు సంహరిస్తాడు.

ఈ విషయం వనంతోట వద్దకు చేరుకొనే సమయానికి ఆమెకు తెలుస్తుంది.దీంతో పైడిమాంబ తీవ్ర ఆవేదనకు లోనై.‘అన్నలేని లోకంలో తాను ఉండలేనని పెద్దచెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది.మరునాడు అప్పలనాయుడు కలలో కనిపించి పెద్ద చెరువుకు పశ్చిమం వైపు తన విగ్రహం దొరుకుతుందని.

దానికి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తుంది.జాలరుల సహాయంతో పైడితల్లి విగ్రహాన్ని బయటకు తీసి చెరువు ఒడ్డున ఆలయం నిర్మించారు.

నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికల్ని తీర్చే కల్పవల్లిగా విజయనగర గ్రామదేవతగా అమ్మవారు ఇక్కడ వెలిశారు.నేటికీ పూజలు అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube