మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కచ్చితంగా వాస్తు ప్రకారం జీవిస్తూ ఉంటారు.నిజానికి వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయని చాలా మంది ప్రజల నమ్మకం.
అందుకోసమే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు.అంతే కాకుండా మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఒక్కోసారి సమస్యలు ఉంటే ఒక్కొక్కసారి ఆనందం కూడా ఉంటుంది.ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఏ ఒక్కరు ఊహించలేరు.
అంతే కాకుండా మనకి ప్రతిరోజు కలలు కూడా వస్తూ ఉంటాయి.కలలో జరిగేవి మన జీవితంపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు పీడకలలు వస్తే వస్తూ ఉంటాయి.అలాంటప్పుడు ఏదో చెడు జరుగుతుందని తెలుసుకుంటూ ఉంటాము.
అయితే కలలో వెండి కానీ బంగారం కానీ కనిపిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో కనుక బంగారు ఆభరణాలు లేదంటే వెండి ఆభరణాలు కనబడితే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతుందని ఎదుగుదల ఉంటుందని దానికి సంకేతం.
ఒకవేళ కనుక బాగా ఎక్కువ బంగారం బాగా ఎక్కువ వెండి మి కలలు కనిపిస్తే మీ వ్యాపారంలో నష్టం రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.
ఎవరికైనా బంగారం లేదా వెండిని బహుమతిగా ఇస్తున్నట్లు మీకు కల వచ్చిందంటే అది మళ్లీ మీ మంచికే అని అర్థం చేసుకోవాలి.ఒకవేళ అందంగా ఆభరణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకుంటూ ఉంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.మీరు మీకు స్వయంగా బంగారం కొనుక్కున్నట్లు కల వస్తే త్వరలో మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.