దర్శకుడు శంకర్ ని పరిచయం చేయడం కోసం నిర్మాత పెట్టిన కండిషన్ ఎంటి?

నిర్మాత కుంజుమన్.ఈ పేరు తెలుగు వారికి పెద్దగా తెలీదు.

 Producer Kunjuman Conditions To Director Shankar Details, Director Shankar, Prod-TeluguStop.com

తమిళంలో మాత్రం ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్.దర్శకుడు శంకర్ కి ఈ సినిమా జీవితాన్ని ప్రసాదించింది కుంజుమనే.

కుంజుమన్ సినిమాలో ఎవరైనా డైరెక్టర్ పరిచయం అవుతున్నారు అంటే కచ్చితంగా ఐదు సినిమాలు అతడితోనే చేయాలని అగ్రిమెంట్ రాయించుకుంటాడు అందుకు గల కారణం ఆదర్శకుల మీద ఉన్న నమ్మకం కాదు తన సెలెక్షన్ పై తనకు గట్టి విశ్వాసం.మంచి వారిని ఎంకరేజ్ చేయడంలో టాలెంట్ కు పెద్దపీట వేయడంలో ఎల్లప్పుడూ కుంజుమన్ ముందు వరసలో ఉంటాడు.

అలా శంకర్ కి మొదట అవకాశం ఇచ్చి దర్శకుడిగా పరిచయం చేశాడు.వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా జెంటిల్మెన్. ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధించింది.సినిమా విజయం తర్వాత కుంజుమన్ చిత్ర బృందానికి అనేక బహుమతులు ఇచ్చాడు.

సినిమా దర్శకుడైన శంకర్ కి అత్యంత లగ్జరీగా ఉండే దేవార్ ఆఫీసును బహుమతిగా ఇవ్వడంతో పాటు అప్పట్లో సెలబ్రిటీలు అందరూ వాడే మారుతి 800 కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు కుంజుమన్.

Telugu Shankar, Gentleman, Prabhudeva, Premikudu, Kunjuman-Movie

అంతేకాదు దర్శకుడు శంకర్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి కూడా స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు.అలాగే ఆ సినిమా కోసం పనిచేసిన ఇతర సాంకేతిక నిపుణులకు వారి వారి అసిస్టెంట్స్ అందరికీ బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు.మొదటి చిత్రం ద్వారా ఇంతటి భారీ సక్సెస్ నిర్మాత తో పాటు సాంకేతిక బృందం అంతా కూడా భారీ బహుమతులను పొందింది కాబట్టి మరొక సినిమా అందరూ కసితో చేయాలనీ నిర్ణయించుకున్నారు.

Telugu Shankar, Gentleman, Prabhudeva, Premikudu, Kunjuman-Movie

ఆ తర్వాత శంకర్ ప్రేమికుడు సినిమా స్క్రిప్ట్ తో సిద్ధమయ్యాడు.సుందరం మాస్టారు తో నిర్మాత కుంజుమన్ మంచి పరిచయం ఉండేది.అలాగే ప్రభుదేవాకు చేస్తున్న డ్యాన్సులను చూసి మైమర్చిపోయేవాడు.అందుకే ప్రేమికుడు సినిమా కోసం ప్రభుదేవా నీ హీరోగా చేయాలనుకుంటే శంకర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేసిన శంకర్ కూడా కన్విన్స్ అయ్యాడు కానీ చిత్ర బృందంలో ఒక్కరు కూడా ప్రభుదేవాన్ని హీరోగా ఒప్పుకోలేదు.సినిమా విడుదల అయినా తర్వాత ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube