నిద్రలేమితో దిగులు చెందుతున్నారా? అయితే రోజు నైట్ ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో నిద్రలేమి( Insomnia ) ఒకటి.ఇది చిన్న సమస్యగానే ఉన్న ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

 Best Night Drink To Get Rid Of Insomnia , Insomnia, Insomnia Relief Drink, Lates-TeluguStop.com

గుండెపోటు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలకు నిద్రలేమి ఒక కారణంగా మారుతుంటుంది.అందుకే కంటి నిండా నిద్ర ఉంటే దాదాపు తొంబై శాతం అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు.

ఈ క్రమంలోనే నిద్రలేమి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది స్లీపింగ్ పిల్స్( Sleeping pills) ను వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వెంటనే స్లీపింగ్ పిల్స్ ను వాడటం మానేయండి.

ఎందుకంటే సహజంగానే నిద్రలేమి సమస్యను వదిలించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ డ్రింక్ ఏంటి.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( cumin), వన్ టేబుల్ స్పూన్ వాము, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, అర అంగుళం పొట్టు తొలగించి దంచిన అల్లం ముక్క వేసుకుని కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడి వేసి కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ప్రతిరోజు నైట్ పడుకోవడానికి గంట ముందు ఏ డ్రింక్ ను తీసుకోవాలి.నిద్రలేమి సమస్యను నివారించడానికి ఈ డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ డ్రింక్ ను తీసుకుంటే సుఖమైన మరియు ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.కాబట్టి ఎవరైతే నిద్రలేమి సమస్యతో దిగులు చెందుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube