మనదేశంలో దాదాపు చాలామంది ఇళ్లలో తులసి మొక్క కు ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు కూడా పోస్తూ ఉంటారు.
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.దాదాపు మన దేశ వ్యాప్తంగా తులసి మొక్క లేని ఇల్లు ఉండదు.
తులసి మొక్కకి స్నానం చేసిన తర్వాత నీరు పోస్తే మంచి జరుగుతుంది.
అయితే తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, అలాగే ఆర్థిక సమస్యలు కూడా దూరమైపోయే అవకాశం ఉంది.తులసి మొక్కకు రోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం వల్ల కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇలా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణమూర్తి అనుగ్రహం కూడా ఆ ఇంటిపై ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.

తులసికి ఎక్కువగా నీరు పోయకూడదు.ఆదివారమైతే తులసి మొక్కను అస్సలు ముట్టుకోకపోవడమే మంచిది.అంతేకాకుండా ఆదివారం రోజు లక్ష్మి తులసి మొక్కను ముట్టుకోవడం కానీ, నీరు పోవడం కానీ చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చే అవకాశం ఉంది.తులసి మొక్కకు పూజ చేసే సమయంలో నీరు పోసినట్టయితే తులసి మంత్రాన్ని కచ్చితంగా జపించాలి.
ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వల్ల సుఖశాంతులు, సౌభాగ్యం, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా కుటుంబ సభ్యుల పై ఉంటుంది.
తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం మంచిది.మంత్రం: మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్య వర్ధిని ఆది వ్యాధి అర నిత్యం తులసి త్యం నమస్తే…అని ఈ మంత్రం జపిస్తూ నీరు పోయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
DEVOTIONAL