కర్లీ హెయిర్ తో విసిగిపోతున్నారా.. ఈ చిట్కాలతో సహజంగానే స్మూత్ గా మార్చుకోండి!

సాధారణంగా మనలో చాలా మందికి కర్లీ హెయిర్( Curly hair )ఉంటుంది.అయితే ఎక్కువ శాతం మంది కర్లీ హెయిర్ ను ఇష్టపడరు.

 Natural Remedies To Make Curly Hair Smooth , Curly Hair, Smooth Hair, Silk-TeluguStop.com

ఎందుకంటే కర్లీ హెయిర్ తరచూ చిట్లిపోతుంది.చిక్కు పడుతుంది.

ఇక ఆ చిక్కులను విడదీయడానికి జీవితం మొత్తం కేటాయించినా సరిపోదు.అందుకే కర్లీ హెయిర్ తో విసిగిపోతుంటారు.

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు మీకు అద్భుతంగా సహాయపడతాయి.వీటితో సహజంగానే కర్లీ హెయిర్ ని స్మూత్ గా, సిల్కీ గా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Curly, Care, Care Tips, Masks, Healthy, Remedy, Silky, Smooth-Telugu Heal

పోషకాల నిలయమైన గుడ్డు కర్లీ హెయిర్( Curly hair ని స్మూత్ గా మార్చడానికి సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డును( Egg ) బ్రేక్ చేసి వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ( Olive oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట‌ అనంతరం షాంపూ చేసుకోవాలి.ఇలా కనుక తరచూ చేస్తే జుట్టు సహజంగానే స్మూత్ గా సిల్కీ గా మారుతుంది.

అలాగే వారానికి రెండు సార్లు అయినా హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి.అంటే మీ రెగ్యులర్ ఆయిల్ ను కాస్త హీట్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు, జుట్టుకు అప్లై చేసుకోవాలి.

మసాజ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి.దీంతో మీ కురులు తేమ‌గా ఉంటాయి.

ఆరోగ్యంగా మార‌తాయి.

Telugu Curly, Care, Care Tips, Masks, Healthy, Remedy, Silky, Smooth-Telugu Heal

క మరొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే.మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అవకాడో ప‌ల్ప్‌ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంట తర్వాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు కనుక చేస్తే మీ రింగ్ రింగుల జుట్టు సహజంగానే స్మూత్ గా, సిల్కీగా మరియు స్ట్రాంగ్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube