శని దేవుడి అనుగ్రహం కోసం శనివారం రోజు ఇలా చేయండి..!

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడిని( Saturn ) న్యాయదేవుడిగా చాలామంది ప్రజలు భావిస్తారు.వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను శనీశ్వరుడు ఇస్తాడు.

 Do This On Saturday For The Grace Of Lord Shani  , Saturn, Lord Shani ,  Saturda-TeluguStop.com

ఎవరి జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు.అదే శని బలంగా ఉంటే అతని జీవితం రాజుల వెలిగిపోతుంది.

అందుకే శనీశ్వరుడి ఆగ్రహానికి ఎవరు గురికావాలని కోరుకోరు.శని అనుగ్రహం కోసం శనివారం కొన్ని నివారణ చర్యలు, పరిహారాలను చేయాలని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.

ఆ నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి శనివారం సూర్యోదయానికి ముందు శనీశ్వరుడినీ పూజించాలి.

అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత పూజిస్తే ఆయన అనుగ్రహం ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి శనీశ్వరుని పూజించడం ఎంతో మంచిది.

Telugu Bhakti, Blue, Devotional, Lord Shani, Saturday, Saturn-Latest News - Telu

పూజ చేసే సమయంలో నీలిరంగు దుస్తులను( Blue dress ) లేదా నలుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి.నీలిరంగు పూలతో పూజ చేయాలి.ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం, కష్టాలు దూరమైపోతాయి.అదృష్టం కూడా కలిసి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.హిందూ మతంలో సూర్యుడి తనయుడు శనీశ్వరుడినీ న్యాయ దేవతగా భావిస్తారు.వ్యక్తి కర్మలకు ఫలితాలను ఇచ్చే శని దృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం ప్రత్యేక చర్యలను పాటించాలి.

అంతేకాకుండా ఒక కంచు పాత్రను తీసుకొని దాని నిండు ఆవ నూనె వేయాలి.ఆ నూనెలో ముఖాన్ని పెట్టి నీడను చూడాలి.

అంతేకాకుండా ఆవు దూడకు ఆహారాన్ని అందించాలి.ఇంకా చెప్పాలంటే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటే అలాంటివారు శనివారం సాయంత్రం ఒక నల్లని గుడ్డను తీసుకొని దానిలో బియ్యం పోసి ముడుపు కట్టి దానిని శనీశ్వరుడి పాదాల చెంత ఉంచాలి.

తర్వాత ఆ బియ్యం తీసుకుని ప్రవహిస్తున్న నదిలో కలపాలి.శనీశ్వరుడి వాహనం కాకులను కలిపిన అన్నం పెట్టడం వల్ల శనీశ్వరుడి ప్రభావం నుంచి బయటపడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube