Pranitha Subhash : ప్రణీత ట్రెడిషనల్ లుక్ కి నెటిజన్స్ ఫిదా.. ఆదిపురుష్ లో సీతగా నువ్వే బెటర్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్( Pranitha Subhash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీరోయిన్లలో ప్రణీత కూడా ఒకరు.

 Tollywood Actress Pranitha Stunning Looks Are Viral-TeluguStop.com

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రణీత మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

అంతేకాకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది , బ్రహ్మోత్సవం, రభస వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.

ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.ఇక అత్తారింటికి దారేది( Atharintiki Daaredi ) సినిమాతో ఊహించని విధంగా విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇక కరోనా మహమ్మారి సమయంలో ఈమె చెప్పా పెట్టకుండా ప్రముఖ బిజినెస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తర్వాత క్షమించమని అడుగుతూ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.ప్రణీత దంపతులకు పాప కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే పెళ్లి అయిన కూడా ప్రణీత అందం ఏమాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు.

పెళ్లి అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తోంది ప్రణీత.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తరచూ ఇంస్టాగ్రామ్ లో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ లు చేస్తోంది.ఈ నేపథ్యంలోని తాజాగా ఈ ముద్దుగుమ్మ తను ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.చిలకపచ్చ రంగు మోడ్రన్‌ డ్రెస్‌లో సీతకోక చిలుకలా మారిపోయింది.

గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ కలర్ డ్రెస్‌లో ప్రణిత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బ్యూటీలో మెరిసిపోయింది.ఈ అమ్మడిని చూస్తుంటే ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్‌లా కనిపిస్తోంది.

ప్రణిత లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు మతిపోగొట్టుకుంటున్నారు.ఇంత అందం ఎలా పెరిగిందని ఆశ్చర్యపోతున్నారు.

ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఇంత అందం ఎలా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు.ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆది పురుష్( Adipurush ) సినిమాలో సీత క్యారెక్టర్ కు మీరు బాగా సూట్ అవుతారు అని కామెంట్ చేయగా చాలామంది ఆ కామెంట్స్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు మళ్లీ సినిమాలలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వచ్చు కదా మేడం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/Ctqoe2uyq_C/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube