బ్రిటన్‌లో తొలి సిక్కు సంతతి ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీ.( MP Tanmanjeet Singh Dhesi ) భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హైకమీషనర్ కరోలిన్ రోవెట్‌తో( British Deputy High Commissioner Caroline Rowett ) యూకే పార్లమెంట్‌లో సమావేశమయ్యారు.
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ధేసీ.భారత్ – యూకేల మధ్య సంబంధాలు, వాణిజ్యం, పర్యాటకాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అంశాలపై కమీషనర్‌తో చర్చించారు.
అలాగే భూ వివాదాల గురించి ప్రవాసుల ఆందోళనలు, విదేశాల్లో ఖైదు చేయబడ్డ వారి వివరాలను ఇద్దరూ పంచుకున్నారు.దీనితో పాటు అమృత్‌సర్‌లోని గురు రామ్ దాస్‌జీ అంతర్జాతీయ విమానాశ్రయం, చండీగడ్‌లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు యూకే – పంజాబ్ మధ్య మరిన్ని ప్రత్యక్ష విమానాలను ప్రారంభించాల్సిన అవసరం వుందన్నారు.

పంజాబ్, యూకేల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ( UK – Punjab Direct Flight Connectivity ) కోసం తాను అవిశ్రాంతంగా వాదిస్తున్నానని ధేసీ పునరుద్ఘాటించారు.దీని వల్ల యూకే సహా పలు యూరప్ దేశాల్లో నివసిస్తున్న పంజాబీ ఎన్ఆర్ఐలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.ఇరు ప్రాంతాల ఆర్ధిక వృద్ధి, సాంస్కృతిక మార్పిడి, పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతాయని ధేసీ తెలిపారు.అమృత్‌సర్ – లండన్ గాట్విక్, అమృత్‌సర్ – బర్మింగ్‌హామ్ మధ్య తక్కువ సంఖ్యలో డైరెక్ట్ ఫ్లైట్స్ వున్నప్పటికీ .లండన్ హీత్రో – అమృత్‌సర్ మధ్య రోజువారీగా విమాన సర్వీసులు వుండాలన్నారు.ఉత్తర అమెరికాలోని ఇతర గమ్యస్థానాలకు వెళ్లేందుకు హీత్రూ ప్రధాన కేంద్రమని ధేసీ చెప్పారు.

ఇకపోతే.ఇటీవల ఒడిషా నుంచి యునైటెడ్ అరబ్ ఎయిరేట్స్ (యూఏఈ)కి డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి దుబాయ్‌కి తొలి విమానం ప్రారంభమైన సందర్భంగా దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, ఒడిషా ప్రభుత్వాలు ‘‘ ఒడిషా దివస్’’ పేరుతో వేడుకలు సైతం నిర్వహించారు.ఇండిగో సంస్థ ప్రారంభించిన ఈ డైరెక్ట్ ఫ్లైట్ వల్ల యూఏఈలో నివసిస్తున్న దాదాపు 10 వేల మంది ఒడిషా ప్రవాసుల ప్రయాణ కష్టాలకు ముగింపు పలికినట్లయ్యింది.
వీరంతా గతంలో భారత్‌లోని మిగిలిన నగరాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా యూఏఈకి చేరుకోవాల్సి రావడంతో అనేక వ్యయ, ప్రయాసలను ఎదుర్కొనేవారు.ఈ నేపథ్యంలో ఒడిషా ఎన్ఆర్ఐలు గట్టి లాబీయింగ్ ద్వారా భువనేశ్వర్ నుంచి దుబాయ్‌కి తొలి అంతర్జాతీయ విమానాన్ని సాధించారు.







