మధుమేహం( Diabetes ) దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అని దాదాపు చాలామంది ప్రజలకు తెలుసు.మధుమేహం సోకిందంటే దాన్ని అదుపు చేయడం తప్ప పూర్తిగా నయం చేయలేరు.
ఆరోగ్యకరమైన జీవనశైలి,ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నడక, ధ్యానం లేదా యోగా అభ్యాసాల ద్వారా మధుమేహాన్ని అదుపు చేయవచ్చు.అయితే ఇప్పటికే మధుమేహం వ్యాధి భారిన పడినవారు ప్రతి రోజు ఆహారంలో విటమిన్ K అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో మంచిది.

ఎందుకంటే విటమిన్ కె ( Vitamin K )రక్తం లోని చక్కెరను అదుపులో ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.పోషకాలు అధికంగా ఉండే కూరగాయలలో బ్రొకోలీ ( Brocooli )ఒకటి.ముఖ్యంగా ఈ కూరగాయలలో ఐరన్, ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.వీటితో పాటు విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది.ఇందులో విటమిన్ k గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అంతేకాకుండా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నివారిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఆకుపచ్చని కూరగాయల కోవాకు చెందిన పాలకూరలో మానవ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి.ముఖ్యంగా ఈ కూరగాయలలో సమృద్ధిగా నీటి కంటెంట్ తో పాటు విటమిన్ k కూడా ఉంటుంది.అలాగే ఈ కూరగాయలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.అందువల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా అదుపు చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు మెంతికూర( Fenugreek (లు ఉంటాయి.ఈ కూరగాయను మనం రోజువారి ఆహారంలో ఉపయోగించడం ద్వారా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆకుకూరల్లో కరిగే ఫైబర్,బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి.ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా విటమిన్ k కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.అలాగే శరీరా ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.