సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువకాలం పాటు కొనసాగరు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త తరం హీరోయిన్స్ వచ్చి పాత హీరోయిన్స్ కి ఛాన్స్ లు లేకుండా చేస్తారు.అయితే హీరోయిన్ల కెరియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు కెరియర్ బాగున్నప్పుడే డబ్బులు సంపాదిస్తారు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు ప్రేమ పెళ్లి వైపు ఆలోచిస్తారు.
శ్రేయ
2001లో ఇష్టం సినిమాతో పరిచయమైన శ్రేయ ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది హీరోయిన్ ఎవరైనా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు ఉండడం అంటే మాటలు కాదు.కానీ ఇప్పటికే శ్రేయ అంతే అందంగా అన్ని అవకాశాలను దక్కించుకుంటూ ఇప్పుడున్న హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తున్నారు అలాంటి శ్రేయ అప్పట్లో అందరు హీరోలతో నటించి మెప్పించారు వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్ సినిమా , నాగార్జునతో సంతోషం, నేనున్నాను ,బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, చిరంజీవి ఠాగూర్ లాంటి సినిమాల్లో నటించి తను ఒక పెద్ద హీరోయిన్ గా గుర్తింపు పొందింది అక్కినేని వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన మనం సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది.అయితే శ్రియ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారులు అయిన ఆండ్రీ కొచ్చివ్వు నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ప్రస్తుతం శ్రేయ రష్యా లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.అయితే శ్రేయ ప్రస్తుతం దర్శక ధీరుడు జక్కన్న ఆయన రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న త్రిబుల్ ఆర్ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది.
రిచా గంగోపాధ్యాయ
రిచా గంగోపాధ్యాయ డిల్లీకి చెందిన అమ్మాయి.అయితే వీళ్ల ఫ్యామిలీ అమెరికాలో సెటిల్ అయింది.అయితే ఈమె శేఖర్ కమ్ముల తీసిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇంటర్నేషనల్ గుర్తింపుపొందిన రానా కూడా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రిచా ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్ సినిమా లో హీరోయిన్ గా నటించింది అలాగే ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించి అందరి మన్ననలు పొందింది.రిచా తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది.
అయితే తను ఇండస్ట్రీకి రాకముందు తన స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే తనకు అమెరికాలో జోయ్ లాంగ్ఎలా అనే ఫ్రెండ్ ఉండేవాడు.ఇండస్ట్రీకి రాకముందే అతనితో డేటింగ్ చేసింది ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో స్కూల్ ఫ్రెండ్ అయినా జోయ్ లాంగ్ఎలా నీ పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది.
ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దంపాటు ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్, షారుక్ ఖాన్,సల్మాన్ ఖాన్ లాంటి దిగ్గజ ఆర్టిస్టులతో నటించి తనదైన మార్కు నటనతో బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.ప్రియాంక చోప్రా కూడా అమెరికాకు చెందిన పాప్ సింగర్ నటుడు అయిన నికోలస్ జర్నీ జోనస్ నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రియాంక చోప్రా తరచుగా ఏదో ఒక వివాదంతో టీవీలో కనిపిస్తూ ఉంటారు ప్రధాని మోడీని కలిసినప్పుడు ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా ఆయన ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది అని ప్రియాంక చోప్రా మీద వచ్చిన ఒక వివాదం కూడా అప్పట్లో చాలా సంచలనం రేపింది.
ఇలియానా
తెలుగులో దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియానా ఆ తర్వాత అనతికాలంలోనే చాలా పెద్ద టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమా తో టాప్ హీరోయిన్ గుర్తింపు పొందారు ఆ తర్వాత పెద్ద హీరోలందరితో నటించి ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపించారు.అయితే ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్ అనే ఫోటోగ్రాఫర్ ని ప్రేమించారు స్వతహాగా ఫోటోగ్రాఫర్ కావడంతో వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చేసేది ఇలియానా.
అయితే వీళ్ళు మొదట్లో ప్రేమించుకున్నప్పటికీ తర్వాత పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి కానీ అవన్నీ నిజం కాదని ఇలియానా అతనితో బ్రేకప్ అయిందంటూ చెప్పుకొచ్చింది.