రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వ్యవహారం ఆసక్తిగా మారింది.తాజాగా నాలుగు రోజుల నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయంలో అధికారుల వైఖరి.
కాంట్రాక్టులు, ఆలయం ఆదాయం వంటి విషయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు చేస్తున్నారు.అయితే.
ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ కావడం.పైగా మంత్రి వెలంపల్లి కనుసన్నల్లో నడుస్తున్న ఆలయంగా గుర్తింపు పొందిన ఆలయంలో వరుసగా దాడులు చేయడం.
సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలోనే కొంచెం లోతుగా దృష్టిసారించిన మేధావులకు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
మంత్రి వెలంపల్లిపై సొంత పార్టీ నాయకులే.ఫిర్యాదులు చేశారని.
చాపకింద నీరులా ఆయనకుఎసరు పెడుతున్నారని అంటున్నారు.విజయవాడకే చెందిన కీలక నాయకుడు.
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేత ఒకరు.మంత్రిపై ఫిర్యాదులు మోశారని.
తెలుస్తోంది.ప్రధానంగా.
విజయవాడ దుర్గమ్మ ఆలయానికి చెందిన రథంలో మూడు వెండి సింహాలు మాయం కావడం సహా దుర్గమ్మ ఆలయానికి చెందిన కాంట్రాక్టుల విషయంపైనా ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.

మంత్రి వెలంపల్లి వచ్చిన తర్వాత.దుర్గగుడిలో అనేక మార్పులు చేశారు.అప్పటివరకు ఫ్రీగా ఉన్న చెప్పుల స్టాండును కాంట్రాక్టర్కు అప్పగించారు.
అదేవిధంగా పార్కింగ్ ప్రాంతాల్లోనూ ఫీజులు పెంచేశారు.ఇక, ప్రసాదాల ధరలను కూడా పెంచేశారు.
అయితే.దీని వెనుక ఏదో జరిగిందని.
అప్పట్లోనే వార్తలు వచ్చినా.ఈ రేంజ్లో వైసీపీ నాయకులే.
ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు.తాజాగా మాత్రం ఇది నిజమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చెప్పుకొని రావడం గమనార్హం.మరి ఇది చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.