తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో మిగతా దర్శకులందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి ( Gautham Tinnanuri )లాంటి దర్శకుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘కింగ్ డమ్’( Kingdom ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడమే కాకుండా జెర్సీ సినిమాతో బాలీవుడ్ లో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో పాన్ ఇండియా నేపధ్యంలో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

తద్వారా ఆయన ఇమేజ్ ఎక్కడైతే డామేజ్ అయిందో అక్కడే తన ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరోకెత్తుగా మారిపోతుంది.నిజానికి ఆయన చేయబోతున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాడు.
కానీ హిందీ జెర్సీ విషయంలోనే ఆయన చాలా వరకు రాంగ్ స్టెప్ వేశాడు.కారణం ఏదైనా కూడా గౌతమ్ తిన్ననూరి లాంటి డైరెక్టర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారబోతున్నాడు అనేది స్పష్టంగా ప్రూవ్ అవ్వబోతుంది…
.







