ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్ ( Ram Charan, Jr.NTR, Allu Arjun, Prabhas
)లాంటి హీరోలు వరుసగా పాన్ ఇండియా మూవీలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.కానీ సీనియర్ హీరోలు అయినా బాలకృష్ణ, చిరంజీవి,నాగార్జున, వెంకటేష్( Balakrishna, Chiranjeevi, Nagarjuna, Venkatesh ) లు సినిమాలలో నటిస్తున్నప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడం లేదు.దీంతో ఈ విషయం పట్ల చాలా రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు సీనియర్ హీరోలు ( Senior heroes )పనికిరారా అన్న ప్రశ్న ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.అయితే పైన చెప్పుకున్న యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా చిరంజీవికి మార్కెట్ ఉంది.
సినిమా క్లిక్ అయితే కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది.ఫ్లాప్ అయితే ఆ నష్టాలు లెక్కకు కూడా అందవు.
అది వేరే సంగతి.సీనియర్లలో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి నుంచి మాత్రం ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా రాలేదు.
రాలేదు అనే కంటే, ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదేమో అనుకోవాలి.చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని ప్లాప్స్ కొన్ని హిట్స్ వచ్చాయి.

ఫ్లాపుల్ని వదిలేస్తే, ఆయన హిట్స్ ఏవీ నార్త్ బెల్ట్ లో క్లిక్ అవ్వలేదు.ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు.ఇది పాన్ ఇండియా సబ్జెక్టే.ఖర్చు కూడా బాగానే చేస్తున్నారు.కానీ ఇక్కడ సమస్య ఖర్చు కాదు.విశ్వంభర సబ్జెక్ట్ నార్త్ జనాలకు పట్టాలి.
అది జరిగితే చిరంజీవి పాన్ ఇండియా కల నెరవేరినట్టే అని చెప్పాలి.రీఎంట్రీలో కూడా బాలీవుడ్ లో మెరిసిన ఘనత సొంతం అవుతుంది.
మరోవైపు బాలయ్య బాబు పాన్ ఇండియా దిశగానే తన ప్రయత్నాలు చేస్తున్నారు.భగవంత్ కేసరి సినిమాకు స్వయంగా తనే డబ్బింగ్ చెప్పి మరీ హిందీలో రిలీజ్ చేశారు.
కాకపోతే సైమల్టేనియస్ రిలీజ్ కాదు.తాజాగా డాకు మహారాజ్ హిందీ వెర్షన్ కూడా రిలీజైంది.
అయితే ఆ రెండూ అక్కడ క్లిక్ అవ్వలేదు.బాలకృష్ణకు పాన్ ఇండియా ఇమేజ్ ఇవ్వలేదు.
ఇప్పుడు బాలకృష్ణ తన ఆశలన్నీ అఖండ 2 పైనే పెట్టుకున్నారు.

దీనికి 2 కారణాలు ఉన్నాయి.ఒకటి బోయపాటి( Boyapati ) ఊరమాస్ టేకింగ్ కాగా, రెండోది నార్త్ జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేసే మైథలాజికల్ సబ్జెక్ట్.అయితే ఇంతక ముందు బోయపాటి తీసిన కొన్ని సినిమాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
అలా ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా కుంభ స్థలాన్ని కొట్టాలని డిసైడ్ అయ్యారు.ఇకపోతే నాగార్జున వెంకటేష్ ల విషయానికి వస్తే.వీరిద్దరూ ఈ రేసులో చాలా దూరంగా ఉన్నారు.వెంకటేష్ తన సినిమాల్ని పూర్తిగా తెలుగు మార్కెట్ కే పరిమితం చేశారు.
బ్లాక్ బస్టర్ హిట్టయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఉత్తరాదిన విడుదల చేయలేదు.పాన్ ఇండియా లెవెల్ సినిమా చేయాలని అనుకొని చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవ్వదని, చేసిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్టయినప్పుడు మాత్రమే అది పాన్ ఇండియా సినిమా అనిపించుకుంటుందని గతంలో వెంకీ అన్నారు.
స్టేట్ మెంట్ అయితే బాగుంది కానీ, కనీసం ఆ దిశగా ఆయన ప్రయత్నించడం లేదు.ఇక నాగార్జున సంగతి సరేసరి.
ఆయన రీజనల్ సినిమానే తీయడం లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశించడం అత్యాశే అవుతుంది.
సరైన హిట్ సినిమా పడి నాగార్జునకు చాలా కాలం అయ్యిందని చెప్పాలి.