టీ.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీతోనే రోజును ప్రారంభిస్తారు.టీ లో ఎన్నో రకాలు ఉన్నాయి.ఒక్కొక్కరు ఒక్కో టీ ని ఇష్టంగా తీసుకుంటారు.అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి.
టీ తాగడం తగ్గించమని నిపుణులు చెబుతుంటారు.టీ వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుంది.
అందుకే టీకి వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూచిస్తారు.కానీ, సమ్మర్‌లో హెల్త్‌కు మేలు చేసే సూపర్ టేస్టీ టీ లు కొన్ని ఉన్నాయి.
మరి ఆ టీ లు ఏంటో.? అవి వేసవిలో ఆరోగ్యానికి ఏయే లాభాలాను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ పెటల్ టీ..సమ్మర్ లో తీసుకోదగ్గ బెస్ట్ టీగా దీనిని చెప్పుకోవచ్చు.ఒక కప్పు చప్పున రోజ్ పెటల్ టీని ప్రతి రోజు తీసుకుంటే అధిక వేడి తొలగిపోయి శరీరం చల్లగా మారుతుంది.
అలాగే ఈ టీలో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి.రోగాల బారిన పడకుండా అడ్డుకట్ట వేస్తుంది.

సమ్మర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే టీలలో లెమన్ టీ ఒకటి.దీనిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండొచ్చు.అధిక దాహం నుంచి తప్పించుకోవచ్చు.మరియు ఎండల వల్ల వచ్చే తలనొప్పి, కళ్లు తిరగడం, ఒత్తిడి వంటి వాటి నుంచి లెమన్ టీ క్షణాల్లో రిలీఫ్‌ను అందిస్తుంది.
పుదీనా టీ.ఇది సూపర్ టేస్ట్‌ను కలిగి ఉండటమే కాదు వేసవిలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను సైతం అందిస్తుంది.సమ్మర్‌లో రెగ్యులర్‌గా పుదీనా టీని తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు రాత్రుళ్లు మంచిగా నిద్ర కూడా పడుతుంది.