ఆస్తమా( Asthma ) అంటే ఊపిరితిత్తులకు సోకే ఒక అలర్జీ వ్యాధి.ఇది వృద్ధుల నుండి పిల్లల వరకు ఎవరికైనా రావచ్చు.
మరి ముఖ్యంగా బాల్యంలోనే ఆస్తమా లక్షణాలు కొంతమందికి కనిపిస్తాయి.అయితే ఇది వంశపారంపర్యంగా, జన్యుపరంగా కూడా రావచ్చు.
అలా అని కచ్చితంగా వస్తుందని కూడా లేదు.ఒకవేళ తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 70% ఉంది.
అయితే మిగతా 30% రాకపోవచ్చు అని అర్థం.అయితే కొందరికి పుట్టుకతోనే ఆస్తమా వస్తుంది.

అది నిద్రాణ స్థితి( Dormant status )లో ఉండి పిల్లలకు ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి బయటపడుతుంది.అందుకే ఆస్తమాతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా మందులు వాడాల్సిందే.అయితే ఆస్తమా బారిన పడిన వారికి తరచూ దగ్గు వేధిస్తోంది.ముఖ్యంగా చల్లని వాతావరణంలో దగ్గు విపరీతంగా పెరుగుతుంది.వారు శ్వాస తీసుకోవడానికి( Breathing Problem ) కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాగే ఛాతి భాగంలో బిగుతుగా అనిపిస్తుంది.
ఛాతిపై బరువు పెట్టినట్లుగా ఫీల్ అవుతారు.ఆయాసంగా అనిపిస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అది ఆస్తమా అని అవమానించాల్సిందే.ఆస్తమా రావడానికి కొన్ని రకాల అలర్జీ కారకాలు ఉన్నాయి.ముక్కును, నోటిని తాకితే చాలు ఆస్తమా లక్షణాలు( Asthma Symptoms ) బయటపడతాయి.ఆస్తమా పువ్వుల్లోని పొడి, దుమ్ము దూళి, వాహనాల నుంచి వచ్చే పొగ, సిగరెట్ పొగ, అగరబత్తుల పొగ లాంటిది రోగులకు అలర్జీని కలిగిస్తుంది.
అలాగే బొద్దింకలు, నల్లులు కూడా అలర్జీని పెంచుతాయి.

పెంపుడు జంతువుల( Pets Hair ) నుంచి రాలే వెంట్రుకల వల్ల కూడా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.అసలు ఆస్తమాకు శాశ్వత పరిష్కారం లేదు.ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి.
దీనికి చికిత్స కూడా లేదు.ఎలర్జీ కారకాలు శరీరంలో చేరితే ఆస్తమా లక్షణాలు వెంటనే కనిపిస్తాయి.
అందుకే వీటిని కొన్ని జాగ్రత్తలతో పట్టుకోవాల్సిందే తప్పించి దీన్ని పూర్తిగా నయం చేసుకోలేము.ఆస్తమా ఉన్న కూడా తగిన మందులు, జాగ్రత్తలు తీసుకుంటే సంతోషంగా ఉండవచ్చు.







