ఇటీవల చెన్నైకి( Chennai ) చెందిన నిషా( Nisha ) అనే మేకప్ ఆర్టిస్ట్‌కి ఊహించని షాక్ తగిలింది.దుబాయ్ ట్రిప్ కోసం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ఆమె కూతుర్ని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు.
అసలు విషయం ఏంటంటే, నిషా కూతురు తన నానమ్మ, పిన్నిలతో కలిసి దుబాయ్ వెళ్లాల్సి ఉంది.టికెట్లు బుక్ చేసుకున్నారు, అన్ని పేపర్లు రెడీ చేసుకున్నారు.
ముఖ్యంగా పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ తో పంపించడానికి పేరెంట్స్ పర్మిషన్ లెటర్ కూడా ఉంది.కానీ ఎయిర్‌పోర్ట్ అధికారులు మాత్రం చిన్నారికి నో ఎంట్రీ అని తేల్చి చెప్పేశారు.
నిషా ఇటీవలే ఈ బాధాకరమైన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.“ఇంతకుముందు మా ఫ్యామిలీలో పిల్లలు చాలాసార్లు వాళ్ల తాతయ్య, నానమ్మలతో దుబాయ్ వెళ్లారు.ఎలాంటి ప్రాబ్లం రాలేదు.కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయంటున్నారు.రెండు నెలల క్రితమే ఈ రూల్ పెట్టారంట.మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు మాత్రం ఏం పర్లేదు, అన్ని డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు” అంటూ నిషా తన ఆవేదన వెళ్లగక్కింది.

“మా పాప ఫస్ట్ టైం ఫారిన్ ట్రిప్ ఇది.మా వల్లే తప్పు జరిగిందని నా కూతురు ఏడుస్తుంటే చూడటం చాలా కష్టంగా ఉంది” అని నిషా కన్నీళ్లు పెట్టుకుంది.మీడియాతో మాట్లాడుతూ, తను, తన ఆయన ఇద్దరూ కలిసి కూతుర్ని పంపించడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చామని చెప్పింది.ఇంతకుముందు తన కొడుకు కూడా నానమ్మతో వెళ్లాడు, అప్పుడు ఏం ఇబ్బంది రాలేదని గుర్తు చేసుకుంది.
కానీ ఈసారి మాత్రం అధికారులు ఎంత చెప్పినా వినలేదని, టికెట్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని వాపోయింది.

నిషా మిగతా పేరెంట్స్ కి కూడా ఇలా జరగకూడదని ఈ స్టోరీని షేర్ చేసింది.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ “పోయిన సంవత్సరం మా 13 ఏళ్ల కొడుకుని కూడా పంపించలేదు.అదృష్టం కొద్దీ టికెట్లు బుక్ చేసుకోకముందే మాకు తెలిసింది” అని చెప్పాడు.చిన్న పిల్లలు ఒంటరిగా ఫ్లైట్ లో వెళ్లాలంటే రూల్స్ ఇవే, 5 ఏళ్ల లోపు పిల్లలు ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదు.5 నుంచి 12 ఏళ్ల పిల్లలు ఒంటరిగా వెళ్లొచ్చు, కానీ వాళ్లని “అన్‌అకంపెనీడ్ మైనర్” సర్వీస్ కింద బుక్ చేసుకోవాలి.13 నుంచి 18 ఏళ్ల పిల్లలు ఒంటరిగా వెళ్లొచ్చు లేదా ఈ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు.







