విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు జన్మభూమి సేవలో తరిస్తూనే ఉన్నారు.ఏ దేశంలో ఉన్నా సరే మాతృభూమి కష్టాల్లో ఉందంటే చాలు తక్షణం వాలిపోతున్నారు.
భారత్‌లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, విదేశీ మారక ద్రవ్యం, పెట్టుబడుల మళ్లీంపు ఎన్ఆర్ఐల వల్ల జరుగుతోంది.తాజాగా పంజాబ్‌కు( Punjab ) చెందిన ఓ ప్రవాస భారతీయుడు తన స్వగ్రామంలో అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని కట్టించాడు.
హోషియార్‌పూర్ – తాండా ( Hoshiarpur – Tanda )రోడ్డులోని తగ్గర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అందరినీ ఆకట్టుకుంటోంది.1972లో గ్రామాన్ని వదిలి కెనడాలో స్థిరపడిన ఓంకార్ సింగర్ తగ్గర్( Omkar Singer Thakar ), తన సోదరులు, బంధువులు, మేనల్లుడి సాయంతో నాలుగు అంతస్తుల్లో కర్తార్ మెమోరియల్ ఆసుపత్రిని ( Kartar Memorial Hospital )నిర్మించారు.దీనిని మార్చి 9న ప్రారంభించనున్నారు.సౌకర్యాలపరంగా ఇది కార్పోరేట్ ఆసుపత్రికి ఏమాత్రం తక్కువ కాదని, తక్కువ ధరల్లోనే అందరికీ అందుబాటులో ఉంటుందని ఓంకార్ సింగ్ తెలిపారు.

ఈ ఆసుపత్రిని ఓంకార్ సింగ్ తన తండ్రి కెప్టెన్ కర్తార్ సింగ్ జ్ఞాపకార్ధం , ఎన్ఆర్ఐ తన బంధువైన పరమ్ జిత్ సింగ్ తగ్గర్‌కు( Paramjit Singh Thakkar ) చెందిన దాదాపు 6 ఎకరాల్లో నిర్మించారు.మొదటి దశలో 80 పడకల ఆసుపత్రిలో 11 మంది వైద్యులు, 30 మంది నర్సులు, 25 మంది సహాయక సిబ్బంది, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఫిజియోథెరపీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ , ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలను అందించనున్నారు.రెండవ దశలో ఆర్ధో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.అలాగే డయాగ్నస్టిక్ సెంటర్, కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ విభాగాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నారు.

తమ కుటుంబంలో క్యాన్సర్ బారినపడ్డ వారి బాధను తాము దగ్గరి నుంచి చూశామని అందుకే ఆంకాలజీ విభాగం అవసరాన్ని తాము అర్ధం చేసుకున్నామని జగత్ తెలిపారు.భవిష్యత్తులో ఇది ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నారని ఆయన వెల్లడించారు.గడిచిన 20 ఏళ్లుగా ఓంకార్ సింగ్ పంజాబ్‌లో విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ సేవలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు.







