సాధారణంగా ఈ రోజులలో చాలామంది ప్రజలలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంది.అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలను అనుసరించి కూడా చివరికి ఫలితాన్ని మాత్రం పొందలేకపోతున్నారు.
కొందరైతే ఎంతో కష్టపడి వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు.అయినప్పటికీ కూడా బరువు తగ్గడం వీలుకాదు.
అయితే శరీర బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా రాత్రి పడుకునే ముందు ఈ సులభమైన చిట్కాలను వినియోగించాల్సిందే.వీటిని ప్రతిరోజు అనుసరించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా సులభంగా అధిక బరువు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గడానికి రాత్రి పూట పడుకునే రెండు గంటల ముందు తేలికపాటి డిన్నర్ ను తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ఆహారాల్లో సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
ఆహారం రుచిని పెంచడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కీలకపాత్ర పోషిస్తుంది.అయితే ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ను కరిగించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఆల్కహాల్ లో అధికంగా కేలరీలు ఉంటాయి.కాబట్టి నిద్ర వేలకు ముందు ఆల్కహాల్ తీసుకుంటే సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంది.అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దీనివల్ల త్వరగా వచ్చే అవకాశం ఉంది.కాబట్టి రాత్రి పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది అని వైద్యులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నిద్రపోయే ముందు ధ్యానం చేయడం కూడా ఎంతో మంచిది.అధిక బరువు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఒత్తిడిని టెన్షన్ను దూరంగా ఉంచడం చాలా మంచిది.
లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అంతే కాకుండా వీటిని నియంత్రించుకునేందుకు ప్రతిరోజు నిద్రపోయే ముందు ధ్యానం చేస్తూ ఉండాలి.బరువు తగ్గాలనుకునే వారికి రాత్రి నిద్ర ఎంతో ముఖ్యం.కాబట్టి సులభంగా నిద్ర రావడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గిపోతుంది అని చెబుతున్నారు.







