బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్నారా.? నాజూగ్గా మారడానికి డైట్ ఫాలో అవుతూ నిత్యం వ్యాయామాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే మీ బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది.
నెల రోజుల్లో మీరు నాజూగ్గా మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పావు టీ స్పూన్ నెయ్యి( Ghee ) వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఆపై అందులోనే నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు, ఐదు నుంచి ఆరు మిరియాలు వేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలను చల్లారబెట్టి మిక్సీ జార్ లో మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ తయారు చేసుకున్న మెంతులు సోంపు పొడి మరియు వన్ టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఒంట్లో ఉన్న క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
అధిక బరువు సమస్య క్రమంగా దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.పైగా నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.







