సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉన్నప్పటికీ మెడ మాత్రం నల్లగా( Dark Neck ) అందవిహీనంగా కనిపిస్తుంటుంది.ముఖ్యంగా ఆడవారు ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు.
హార్మోన్ల మార్పులు, ఎండల ప్రభావం, ఒంట్లో అధిక వేడి, మేకప్ ను సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం, డీహైడ్రేషన్ తదితర కారణాల వల్ల మెడ అనేది ఒక్కోసారి నల్లగా మారుతుంటుంది.అయితే డార్క్ నెక్ ను వైట్ గా మార్చే ఎఫెక్టివ్ ఇంటి చిట్కా ఒకటి ఉంది.
దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో స్లైసెస్( Tomato Slices ) మరియు రెండు పీల్ తొలగించిన బంగాళదుంప స్లైసెస్( Potato Slices ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి,( Besan Flour ) వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి, చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా టమాటో పొటాటో జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు, కావాలి అనుకుంటే ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా ప్యాక్ తొలగించాలి.ఆఖరిగా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.

ఈ రెమెడీ మెడ నలుపును క్రమంగా మాయం చేస్తుంది.చనిపోయిన చర్మం కణాలను తొలగిస్తుంది.చర్మాన్ని డీప్ గా క్లెన్సింగ్ చేస్తుంది.
మీ నెక్ ను సూపర్ వైట్ గా బ్రైట్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ముఖానికి ఈ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల చర్మంపై ఏమైనా మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.
స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.స్కిన్ హెల్తీగా మారుతుంది.







