టాలీవుడ్ యంగ్ హీరో నితిన్( Nithin ), శ్రీలీల( Sreeleela ) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్( Robinhood ).వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు అయితే ఈ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ( David Warner ) కూడా నటించబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి ఇక ఈ విషయాన్ని మేకర్ అధికారికంగా కూడా తెలియజేశారు.

ఇలా డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటించబోతున్నారనే విషయం తెలిసిన క్రికెట్ లవర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ పాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయంపై ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.ఇక మొదటిసారి వెండి తెరపై సందడి చేయబోతున్న డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో నటించినందుకు గాను ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ చాలా చిన్న పాత్రలో నటించినప్పటికీ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.

ఇలా ఈ సినిమాలో భాగమైనందుకు ఈయన ఏకంగా 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఈ మొత్తంలో రెమ్యూనరేషన్ డేవిడ్ వార్నర్ డిమాండ్ చేయకపోయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకున్న నిర్మాతలు తనకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది.ఇక డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమా పాటలకు రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున ఫేమస్ అయిన విషయం తెలిసిందే .అయితే ఆయన మాత్రం సినిమాలపై ఆసక్తితోను సరదాగా ఈ సినిమాలో నటించారని తెలుస్తోంది.







